Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.04.2023
Share:

By Village Missionary Movement

Thursday, 27-Apr-2023

దిన ధ్యానము(Telugu) 27.04.2023

 

అంశం: రెక్కల చాటు

 

"ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది" - కీర్తనలు 91:4

 

కొన్ని దినాల క్రితం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో అమెరికాలో ఉన్న ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ప్రచారం చేయబడింది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అంచనా వేయడానికి అటవీశాఖ అధికారులు వెళ్లారు..అందులో ఒక అధికారి తన చేతుల్లో ఉన్న ఆయుధం ద్వారా అగ్ని యొక్క ప్రభావమును అంచనా వేస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు కింద పక్షి రెక్కల కాలిన స్థితిలో ఉండటం చూశాడు. ఆశ్చర్యపడదు తన చేతిలో ఉన్న కర్రతో ఆ పక్షిని తట్టాడు. బుద్ధిగా ఉన్న పక్షి క్రింద పడిపోయింది. దాని కింద మూడు పక్షి పిల్లలు సజీవముగా ఉండటం చూసి దుఃఖముతో కృంగిపోయాడు. రాబోయే వినాశనము గూర్చి బాగా ఎరిగిన తల్లి పక్షి తన సంతతిని చెట్టు క్రిందకి తీసుకుని వెళ్లి ఉండవచ్చు కానీ తన పిల్లలను విడవకుండా తన ప్రాణముును అగ్నికి అప్పగించుకుంది. తన యొక్క చిన్న శరీరం కాలుతున్నప్పుడు బలముగా నిలబడింది. అది చనిపోవడానికి సిద్ధంగా ఉండటం వలన తన రెక్కల చాటున తన పిల్లలను చేరదీసి జీవింపజేసింది. ఈ పక్షి ఎంతటి సాటిలేని త్యాగం చేసిందో చూశారా? 

 

ఒక పక్షి యొక్క జీవన విధానం ఎంతటి గొప్ప త్యాగము చేసినట్లు చూడబడటం నిజమే. అలా అయితే మన కొరకు యేసుక్రీస్తు చేసిన త్యాగం ఎంతటి గొప్పది. తన పిల్లలైనా మనలను అపవాది చేతిలో నుండి రక్షించుటకు తనను తానే జీవ బలిగా సిలువకు అప్పగించుకున్నారు. ఆ అంతులేని ప్రేమను గ్రహించి ఈ రోజే మనలను మనం సమర్పించుకుందాం. హల్లెలూయ! 

- బ్రదర్. భాగ్య నాదన్ గారు 

 

ప్రార్థన అంశం: 

యూత్ మీటింగ్ కొరకు అవసరమైన కరెంటు ఆటంకం లేకుండా మరియు మైక్ సెట్ చక్కగా పనిచేయు లాగునా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet