Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.04.2023
Share:

By Village Missionary Movement

Friday, 28-Apr-2023

దిన ధ్యానము(Telugu) 28.04.2023

 

అంశం: , క్రీస్తు ప్రేమ

 

"అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము" - రోమీయులకు 8:37

 

వాచ్ మెన్ ని దుఃఖ పుత్రుడు అని పిలవబడుతాడు. ఇతడు చైనాకు చెందిన గొప్ప దైవజనుడు. తన జీవిత కాలంలో చివరి 20 ఏళ్లు జైల్లోనే గడిపారు. క్రీస్తును తిరస్కరించమని చెప్పి ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి చైనా ప్రభుత్వము చిత్రహింసలు పెట్టింది. ప్రతిరోజు 8 గంటలు కష్టపడి పని చేసేవారు. ఆ తర్వాత ఎనిమిది గంటల సమయం అతనికి కమ్యూనిస్టు పాఠాలు బోధించేవారు, మిగతా ఎనిమిది గంటలు అతనిని నిద్ర పోనీయకుండా ఆ కమ్యూనిస్టు ఆదర్శాలతో కూడిన పాటలను, ప్రసంగాలను అధికమైన శబ్దముతో వినబడేలా అతను ఉన్న గదిలో ప్రసారం చేసేవారు. కానీ ఆవి ఏవి ఆ దైవజనుని ప్రభావితము చేయలేదు. అతను చివరి వరకు క్రీస్తును విడిచిపెట్టకుండా విశ్వాసంలో నిలకడగా ఉండి జైల్లోనే తన పందెమును ముగించి పరమ తండ్రి సంతోషంలోనికి ప్రవేశించారు. ఒక దైవజనుడి ముందు ఒక ప్రభుత్వమే ఓడిపోయింది. అతడు రాసిన నార్మల్ క్రిస్టియన్ లైఫ్, దా స్పిరుచువల్ మాన్ వంటి అనేక అద్భుతమైన పుస్తకాలు ఈనాటికిని అనేకులను విశ్వాస వీరులుగా బోధకులుగా మార్చుతూనే ఉన్నాయి. 

 

పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు క్రీస్తు ప్రేమ నిమిత్తము అనేక శ్రమలను కష్టాలను ఎదుర్కొన్నాడు. నూతన నిబంధనలో అనేక పుస్తకాలు రాసింది అపోస్తులుడైన పౌలు. రెండవ కోరింది 11వ అధ్యాయంలో తాను క్రీస్తు కొరకు, తన ప్రేమ కొరకు ఎటువంటి శ్రమలను సహించవలసి వచ్చిందో చెప్పారు. ఒకసారి యూదులు కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు ఐదుసార్లు కొట్టారు అని చెబుతున్నారు. ఇవన్నీ ఎందుకు అని మనము ఆలోచించినట్లయితే పౌలు క్రీస్తు కొరకు కలిగి ఉన్న ప్రేమ కొరకే. కాబట్టి శ్రమలైన ఇబ్బందులైనా మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నందలి మనలను ఎడబాపు నేరవని రూడీగా నమ్ముతున్నాను అని రాశారు. 

 

అవును ప్రియమైన వారలారా! ఆయన ప్రేమ నుండి మనలను ఏది విడదీయగలదు. మనం చేస్తున్న సత్క్రియల కొరకు, ఆయన కొరకు మనం పడుతున్న శ్రమల కొరకు కాదు మనము ఆయన పిల్లలమై ఉండుట వలన మాత్రమే ఆయన మన కొరకు సిలువలో తన ప్రేమను బయలుపరిచారు. సాధారణమైన ప్రేమకు బానిస అయిపోకూడదు. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మనం ఊరకనే ఉండలేము. ఆయన కొరకు దేనినైనా సహించాలి అని అనుకుంటాం. క్రీస్తు ప్రేమను బయలుపరచు వారి వలె అనేకులను మనము ఉపయోగకరంగా మారుద్దాం. హల్లెలూయ! 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

యూత్ మీటింగ్ కి అవసరమైన నీళ్లు అందజేయబడేలా, మరియు బాత్రూం వసతి కలిగేలా, మైదానమంతా చక్కగా ఉండేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet