Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.05.2023
Share:

By Village Missionary Movement

Thursday, 04-May-2023

దిన ధ్యానము(Telugu) 04.05.2023

 

అంశం: దృఢమైన విశ్వాసం

 

"విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము" - హెబ్రీయులకు 11:6

 

 షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే హెబ్రీ యవ్వనులు నెబుకద్నెజరు ముందు విశ్వాసముతో నిలబడ్డారు. మేము సేవించిన దేవుడు మమ్మును తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపము అని ధైర్యంగా చెప్పారు. వారి విశ్వాసము దేవునికి ప్రియముగా ఉన్నందున మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో ముగ్గురితో నాలుగో వ్యక్తిగా సంచరించారు. విశ్వాసం లేని జీవితం నిర్జీవమైనది. 

 

హతసాక్షిగా మరణించిన బెలన్ టినాను చూడండి. ఈమె ఒక బానిస. బలహీనమైన శరీరం గలది కానీ ఈమె దృఢమైన సంకల్పం కలిగి ఉంటుంది. ఈమె రోమా పురి లో గల ఒక స్పోర్ట్స్ స్టేడియంలో చిత్రహింసలకు గురి చేయబడి చంపబడింది. ఉదయం నుండి సాయంత్రం వరకు విగ్రహములను మొక్కమని వేధించారు. ఆమె క్రీస్తు పైన ఉన్న విశ్వాసమును ప్రకటించడానికి కొంచెం కూడా వెనకాడ లేదు. మేము క్రీస్తు సేవకులము అని ప్రకటించింది. ఆమెను అక్కడ ఉన్న ఒక స్తంభానికి కట్టి అడవి మృగాలను బోనులో నుండి విడిచిపెట్టారు. స్తంభానికి కట్టబడిన ఆమె మోకాళ్లపై నిలబడి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ మృగాలు ఆమెని పసి కట్టి ఏ హాని కూడా చేయలేదు. వారు ఆమెను తిరిగి జైలుకు తీసుకుని వెళ్లారు. క్రీడా మహోత్సవాలు చివరి రోజున మరల ఆమెను స్టేడియం వద్దకు తీసుకుని వచ్చారు. ఆమెను ఇనుప కుర్చీ పైన కూర్చుండబెట్టి కర్రలతో కొట్టారు. దారంతో చేసిన వలలో ఆమెను కట్టి వేయగా ఎద్దులు వాటి కొమ్ములతో ఆమెను పొడిచి అటు ఇటు ఎత్తిపడేసాయి. చివరిగా కత్తితో చంపబడి మహిమతో పరలోకమునకు ఎత్తబడింది. 

 

ప్రియమైన వారలారా! మీ విశ్వాసము ఎటువంటిది? బండ పైన కట్టబడిన ఇల్లు వలె దృఢంగా ఉన్నదా లేదా ఇసకపైన కట్టబడిన ఇల్లు వలె అస్థిరముగా ఉన్నదా. ఆలోచించండి మీ విశ్వాసము దేవునికి ప్రియమై ఉండుటకు ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని బలపరిచును గాక. దేవుడు మిమ్మును దీవించును గాక.ఆమెన్!

- శ్రీమతి. జమీమా రాజాసింగ్ గారు 

 

ప్రార్థన అంశం: 

వి.బి.ఎస్ పరిచర్యల మూలముగా దర్శించబడుతున్న మూడు వేలకు పైగా గ్రామాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet