Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.05.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 23-May-2023

దిన ధ్యానము(Telugu) 23.05.2023

 

అంశం: పిల్లల కోసం

 

"యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి" - లూకా 23:28

 

జాన్ స్కాడ్డర్ అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ గా ఉన్నారు. కానీ అతను యొక్క పరిస్థితిని త్యాగం చేసి అతని కుటుంబముతో వచ్చి మిషనరీగా పనిచేశారు. అతను మాత్రమే కాదు అతని యొక్క 9 మంది పిల్ల లు ఈస్ట్ ఇండియాలో సేవ చేశారు. 60 సంవత్సరాలుగా స్కాడ్డర్ ఫ్యామిలీ ఒకరి తర్వాత ఒకరు భారతదేశంకు వచ్చి సేవ చేస్తున్నారు. 

 

ఒకసారి స్కాడ్డర్ కు తన యొక్క స్నేహితుడు ఇలా అడిగాడు. మీ కుటుంబం అంతా త్యాగపూరితమైన సేవ చేయుటకు రహస్యము ఏమిటి అని అడిగాడు. స్కాడ్డర్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా నా భార్య ప్రార్థించే తల్లిగా ఉండడమే ఆమె ఒక ప్రార్థన జీవితం మూలముగా పిల్లలు రక్షణ అనుభవమును పొందుకున్నారు. నా పిల్లలు ఒక్కొక్కరు పుట్టినరోజున ఆ రోజంతా ప్రార్థనలో గడుపుతాది. ఆరోజు విశేషంగా పిల్లలు యొక్క రక్షణ కొరకు, చదువు కొరకు, మంచి ఆరోగ్యము కొరకు, భవిష్యత్తు కొరకు, వీటన్నిటి కొరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుంది అని చెప్పారు. 

 

ప్రియమైన తల్లులారా! ఇలాంటి సాక్ష్యము మీ గురించి చెప్పడానికి అవుతుందా? ఎంతోమంది పిల్లలు యొక్క మంచి మలుపునకు తల్లి యొక్క ప్రార్ధనయే ప్రాముఖ్యంగా ఉంటుంది. జాన్ వెస్లీ, అబ్రహం లింకన్ ఇలాంటివారు గొప్ప నాయకులుగా జీవించుటకు గల కారణము దేవుని యొక్క భయ భక్తులతో నిండిన వారి యొక్క తల్లి యొక్క ప్రార్ధన వారు ఆ విధంగా జీవించుటకు కారణం. ఈరోజు మన యొక్క పిల్లలు లోబడక సరిగా చదవకపోవడం చెడు అలవాట్లు ఇవన్నీ వారి జీవితంలో కూడా మారిపోవాలని అనేక ప్రార్ధన అంశములు రాసి సేవకులకు పంపించి మనము మన పక్క ఇంటి వాళ్లతో లేక చుట్టాలతో ఇలాంటి లోటులను చెప్పి కన్నీరు కారుస్తూ ఉన్నామే తప్పించి దేవుని దగ్గర ఎన్ని గంటల్లో ప్రార్థనలో గడుపుతున్నాం. ఒక్కరోజు వారి కొరకు కేటాయించి ఉపవాసము చేసి వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? 

 

ఒక దేవుని దాసుడు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నా తల్లి ఐదు గంటలకు లేచి నా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల కొరకు మేము పడుకున్నప్పుడు మా పక్కకు వచ్చి మా తల మీద చేయి పెట్టి ప్రార్థిస్తూ ఉండేది. దాని ఫలితముగా ఈరోజు మేమందరము దేవునికి భయపడుతున్న వారుగాను సమాజంలో కఠిన పరిస్థితుల్లోనూ దేవుని యొక్క సేవను చేస్తున్నాము అని కన్నీరు కాచి చెప్పారు. తల్లులారా మీ యొక్క పిల్లలు యొక్క అలవాట్ల కొరకు, చదువు కొరకు, మంచి ఉద్యోగం కొరకు, వాళ్ళ యొక్క వివాహం కొరకు, ప్రతి చిన్న కార్యమైనను దేవునికి తెలియపరచండి. దేవునికి మనము తెలియపరచినప్పుడు ఆయన అన్నిటినీ మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. 

- బ్రదర్. జబ. డేవిడ్ గణేష్ గారు 

 

ప్రార్థన అంశం:

సేలం ఫీల్డ్ లో పాపాతి అనే సహోదరి కి కంటికి మంచి చూపు కలుగు లాగానే ప్రార్థించండి. మరియు హాస్పిటల్ పరిచర్యలో మనము దర్శిస్తున్న ప్రతి పేషెంట్ యొక్క స్వస్థత కొరకు రక్షణ కొరకు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet