Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.05.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 24-May-2023

దిన ధ్యానము(Telugu) 24.05.2023

 

అంశం: క్రీస్తుని రూపం

 

"వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా" - యాకోబు 1:24

 

యవనస్తులు మధ్యలో సేవ చేస్తున్న ఒక సహోదరుడు మిగతా వాళ్ల దగ్గర మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు రూపాన్ని ప్రతిబింబింపజేయాలని ప్రయత్నం చేసేవారు. ఒకరోజు అతని కారు రిపేర్ అయింది. ప్రతిసారి తన కారును రిపేర్ చేసే మెకానిక్ ఆరోజు ఊర్లో లేడు కాబట్టి మరొక కొత్త షాపుకు వెళ్లి తన కారును రిపేరు చేసి ఇమ్మని చెప్పాడు. అతడు తల ఎత్తకుండా తాళం తీసుకుని సరే సరే కానీ వెంటనే అవ్వదు రేపు రండి అని చెప్పాడు. మరుసటి రోజు వెళ్ళినప్పుడు సరైన జవాబు ఇవ్వకుండా తరువాత రోజు రమ్మని చెప్పాడు. ఆ సేవకుడు వెళ్లి తన స్నేహితునితొ ఆ మెకానిక్ నడుస్తున్న విధానాన్ని చెప్పారు. దానికి స్నేహితుడు నీవు ఇలానే ఉంటే అతడు అలానే చేస్తాడు. కాబట్టి అతనిని తిడుతూ కోపగించుకుంటేనే ఆయన పనిని త్వరగా చేస్తాడు అని చెప్పాడు. 

 

వారిద్దరూ మరుసటి రోజు ఆ షాప్ కు వెళ్లి ఆ మెకానిక్ ని బాగా తిట్టాలి అనుకున్నారు. కానీ వారిని చూసిన వెంటనే ఆ మెకానిక్ నవ్వుతూ వచ్చి తాళాలు ఇచ్చి పని పూర్తయింది సార్ బండిని తీసుకుని వెళ్ళండి అన్నాడు. అదేవిధంగా మెకానిక్ కొన్ని రోజుల క్రితమే నా భార్య క్రీస్తుని అంగీకరించింది. నన్ను కూడా చర్చికి రమ్మని పిలిచింది. మీ కార్లో ఒక వాక్యాన్ని చూశాను. దానినిబట్టి మీరు క్రైస్తవులు అని తెలుసుకున్నాను. కాబట్టి నా భార్య ఏది చెప్పిందో ఆ ఓపిక మీ దగ్గర నేను చూశాను. అందునుబట్టి నేను కూడా ఒక క్రైస్తవుడు వలె జీవించాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. కారు ఎక్కి కూర్చున్న ఆ దేవుని దాసుడు ప్రభువా నన్ను క్షమించు నేను నా కోపాన్ని కఠినమైన స్వభావాన్ని అతని యొద్ద ప్రదర్శించి ఉంటే ఆయన నిన్ను ఎరగడానికి నీ దగ్గరికి రావడానికి నేనే ఆటంకంగా ఉండేవాడిని అని చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మీ రూపాన్ని ప్రతిభపింపజేసే అటువంటి విధముగా నన్ను నడిపించండి అని ప్రార్థన చేశాడు. 

 

అవును ప్రియమైన వారులారా! మనము ప్రతి ఒక్కరము క్రీస్తు రూపంలో సృష్టింపబడి ఉన్నాము. కాబట్టి క్రీస్తు యొక్క రూపాన్ని మనము బయటకు ప్రతిబింబింపజేయాలి. ఈ లోకములో క్రీస్తు రూపాన్ని బయటకు చూపించే వారిగా సిద్ధంగా ఉండాలి. మనలను చూస్తున్నవారు క్రీస్తుని మనలో చూడాలి. మన యొక్క జీవితం దేవుని యొక్క రూపాన్ని మనలో చూడాలి. దేవుని యొక్క కార్యాలను మన జీవితము గుండా బయటకు చూపించే విధంగా ఉండాలి. ఎదుటివారిని దేవుని వద్దకు నడిపించే విధముగా మన కార్యాలు ఉండాలి అని ఈరోజు ప్రార్థించి క్రీస్తుని ఇతరులు ఎదుట ప్రతిభంబింప చేద్దాం. 

- బ్రదర్. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:

కడలూరు ఫీల్డ్ లో మార్తా అనే సహోదరికి గల రెండు చేతుల్లో ఉన్న క్యాన్సర్ నుండి ఆమె స్వస్థత పొందుకొనులాగున ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş