Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.06.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 11-Jun-2023

దిన ధ్యానము(Telugu) 11.06.2023 (Kids Special)

 

అంశం: ఎదురుచూపు లేని ప్రేమ

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము" - 1 యోహాను 3:18

 

చాలా వేగంగా జాలీగా తన బంగ్లా ముందు అటు ఇటు అడుకుంటుంది లిడియా. అప్పుడు ఇంట్లో గల సిలిండర్ తేలిపోయి ధమాల్ అనే పెద్ద శబ్దముతో ఇంట్లో నుండి మంటలు బయటకు రావడం ప్రారంభించాయి. లోపల అమ్మ నాన్న ఉండిపోయారు. సిలిండర్ పేలిన శబ్దమునకు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అక్కడ గుమీగూడారు. కొందరు అగ్నిమాపక దలమునకు మరి కొంతమంది పోలీస్ వారికిని ఫోన్ చేస్తూ ఉన్నారు. కాలుతూ ఉన్న లిడియా యొక్క తల్లిదండ్రులను కాపాడుటకు ఎవరు ముందుకు రాలేదు కానీ అది ప్రమాదము అని తెలిసినప్పటికీ ఎంత మాత్రమూ భయపడకుండా బంధువులు లేని మరియు తన భార్యను పోగొట్టుకొని ఒంటరిగా బ్రతుకుతున్న జాన్ అక్కడికి పరిగెత్తుకొని వచ్చి మెట్లు ఎక్కి ఆ చిన్నమ్మాయి లిడియాను ఎత్తుకొని సంరక్షించి బయటకు తీసుకుని వచ్చాడు. ఆయన శరీరమంతా కాలిపోయింది. ముఖము కూడా కాలిపోయింది. ఆయనను వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు లిడియా తల్లిదండ్రులు మాత్రం అగ్నిలో పూర్తిగా కాలిపోయారు. 

 

దినములు గడిచాయి. లిడియా అగ్నిలో కాలిపోయిన తన తల్లిదండ్రులను కాపాడిన జాన్ అంకుల్ ను తలంచుకొని ఏడుస్తూ ఉండేది. ఆమెకు ఆస్తి ఎక్కువగా ఉండినందున ఆమె బంధువులు ఈ అమ్మాయిని నేను పెంచుతాను అని ఆ ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి అందరి ముందు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రెసిడెంట్ అందరినీ పిలిచి నిలబడి మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్లు నేను పెంచుతాను నేను పెంచుతాను అని అరవడం మొదలుపెట్టారు. అప్పుడు వారి మధ్యలో నేను చూసుకుంటాను అనే మెల్లని స్వరము ఒకటి వినబడింది. అది మరెవరో స్వరము కాదు ఆ అమ్మాయిని కాపాడిన జాన్ స్వరమే. అందరూ చూస్తూ ఉండగా ఆయన నెమ్మదిగా బయటికి వచ్చారు. అక్కడ కాలిపోయిన ముఖముతో భయంకరమైన ఆకారంతో జాన్ నిలబడి ఉన్నాడు. ప్రెసిడెంట్ ఆ పాపతో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు అని అడిగారు వెంటనే ఆ అమ్మాయి తన ప్రాణాన్ని లెక్కచేయకుండా తనను కాపాడిన జాన్ అంకుల్ దగ్గరికి వెళ్తాను అని పరిగెత్తుకొని వెళ్లి ఆయనను ముద్దాడి తన మెడను పట్టుకొని ఏడ్చింది లిడియా. ఆ ప్రెసిడెంట్ కూడా ఆమెను జాన్ తో పంపించారు. 

 

ప్రియ తమ్ముడు చెల్లి ఎలాగూ ఈ జాన్ అంకుల్ ఎంత మాత్రమూ ఎదురుచూపు లేకుండా తన ప్రాణము పోయిన పరవాలేదు అని చెప్పి ఆ పాపను కాపాడారో అలాగే మనలను యేసయ్య కాపాడి మనకు చదువును ఆస్తిని అంతస్తులు అని దేనిని ఎదురు చూడకుండా మనము ఎలా ఉన్నా పర్వాలేదు ఆయన మనలను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపత్కాలంలో పరిగెత్తుకుని వచ్చి ఆయన మనకు సహాయం చేస్తారు.

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet cashwin grandpashabet radissonbet palacebet amgbahis cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet