Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.06.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 14-Jun-2023

దిన ధ్యానము(Telugu) 15.06.2023

 

అంశం: శోధనల యొక్క ప్రభావము

 

"ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు(లక్ష్యముచేయుచున్నాడు) గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి" – 1 పేతురు 5:7 

 

క్రీస్తు శ్రమలకు సాక్షిగాను ఇక్కడ రాబోతున్న మహిమకు పాలి భాగస్తుడుగాను ఉంటున్న పేతురు పైన చెప్పబడుతున్న సలహాలు రాస్తున్నారు. యోబు కూడా తన శోధన సమయాలలో దేవుని దూషించకుండా దేవుణ్ణి తేరి చూచి తన భారాలన్నింటినీ కూడా ఆయన పైన పెట్టి నా రక్షకుడు సజీవుడు (యోబు 19: 25)అని ధైర్యముతో విశ్వాసంతో చెబుతున్నారు. మొదటిగా ఆయనను దర్శించినది తన పిల్లలు ఆస్తులు యొక్క నష్టము. రెండవదిగా తన భార్య దేవుని దూషించి ప్రాణాన్ని వదులు అని చెప్పిన వేదనకరమైన అవిశ్వాసమైన మాటలు. మూడవదిగా ఆయన తనను తాను దేవునికి సమర్పించుకున్నది. 

వీటన్నింటిలో యోబు తన పెదవులు చేత ఎంత మాత్రమూ పాపం చేయలేదు. సమాజం వలన తిరస్కరణ మంచి పరిస్థితిలో ఉండి మోసకరమైన పరిస్థితికి వెళ్లడం ఇది కూడా యోబు యొక్క ఆత్మను ఇబ్బంది పెట్టలేదు. మారుగా తనను నూతనముగా దేవునికి సమర్పించి సహనముతో వేచి ఉన్నారు. దీని ప్రభావము యోబు 42వ అధ్యాయములో రెండంతల దీవెనలను నాలుగు తరములు పిల్లలను చూసినా సంపూర్ణ ఆయుష్ గలవాడిగా మరణించిన భాగ్యాన్ని పొందుకున్నారు. యోబు యొక్క సహనమును యాకోబు 5:11 లో చదువుతున్నాం. 

 

యేసుప్రభు అయితే దీర్ఘశాంతంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు చిత్తగించి సిలువలో మరణము వరకు తన్ను తాను తగ్గించుకున్నారు. మన పాపము కొరకు అతిక్రమముల కొరకు మరణించుటకు మనకు సమాధానం ఇచ్చుటకు ఆయన చిత్తగించారు. సాతాను వలన శోధింపబడ్డారు. ప్రధాన యాజకులను సద్దుకయ్యలను యూదా జనాంగము ద్వారా నిందించబడి హేళన చేయబడి అశ్రద్ధ చేయబడ్డారు. ఏ పాపము ఎరుగని ఆయన సిలువను సహించుటకు ఆయన సమర్పించుకున్నారు. దీనివలన ఆయన రక్తము మన పాపముల నుండి మనలను విమోచన ఇస్తుంది. ఆయన నామం వలన ఆరోగ్యము బలము దొరుకుతుంది. ఆయన పునరుద్దానం వలన మనకు నిత్యజీవం వాగ్దానము చేయబడింది. నిత్య దేవుడిని చేరేవరకు క్రీస్తులో నిలిచి ఉందాం. మరనాత! యేసు త్వరగా రాబోతున్నాడు. 

- శ్రీమతి. జయంతి భాగ్యనాధన్ గారు 

 

ప్రార్థన అంశం:

7000 మంది మిషనరీలు ద్వారా లక్ష గ్రామాలు అనే గురిని మనము త్వరగా చేరుకునేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet