Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.06.2023
Share:

By Village Missionary Movement

Monday, 19-Jun-2023

దిన ధ్యానము(Telugu) 19.06.2023

 

అంశం: వసంతమైన వసంతకాలం

 

"నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము" - సామెతలు 4:23

 

ఒకసారి సాధు సుందర్ సింగ్ గంగా నది ఒడ్డున నడుస్తూ వెళ్లారు. అక్కడ ఉన్న వేలకు ప్రజలు నదిలో పవిత్ర స్నానం చేస్తూ ఉన్నారు. వాళ్లతో యేసుక్రీస్తు గురించి మాట్లాడారు. ఎంత మాత్రం ఫలితం లేకపోవడం వలన ఆయన నదిలో దిగారు. తన చేతుల్లో గల ఇనప పెట్టెను వాళ్ళ ముందు తెరిచి అందులో మురికి బట్టలన్నీ ఆ ఇనుప పెట్టిలో పెట్టి తాళం వేశారు. ఆ పెట్టె నీటిలో ముంచి సబ్బు రాయడం మొదలుపెట్టారు. ఏమి చేస్తున్నావ్ అనే వాళ్లకు నా బట్టలకు నేను మురికి పోగొట్టడానికి సబ్బు రాస్తున్నాను అని అన్నారు. అందరూ నవ్వారు. పెట్టిలో గల బట్టలకు బయట సబ్బు రాస్తే ఎలా మురికి పోతుంది? బట్టలకు గదా సుబ్బు రాయాల్సింది అని అన్నారు ప్రజలు. అందుకు సాదు మీ ఆత్మను గల పాపము మరకలుకు నది నీళ్లు ఏమి చేయలేవు. మీ శరీర మురికిని శుభ్రం చేయగలిగిన నీరు మీ ఆత్మలో గల పాపములను శుభ్రము చేయలేవు. మీ ఆత్మను పవిత్ర పరచడానికి యేసుక్రీస్తు అనే దైవము సిలువలో రక్తము కార్చారు. ఆయన రక్తము ద్వారా మీయొక్క పాపములన్ని కూడా కడగబడి పవిత్రులుగా మారతారు. మీకు కూడా సంతోషము సమాధానము కలుగుతుంది అన్నారు. వెంటనే వారు యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అవును ఈ దినము వరకు మన భారతదేశంలో అనేకులు మూఢనమ్మకాలతో చిక్కుబడిపోయి ఉన్నారు. సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని వెతుకుతున్న ప్రజలు ఏదైనా ఒకటి చేసి దానిని పొందుకోవచ్చు అని తలుస్తున్నారు. వాళ్ళ యొక్క మనో నేత్రాలు తెరవబడాలి అంటే సువార్త ఒక్కటే మార్గం. 

 

ప్రపంచంలో మనుష్యుడు యొక్క మనసులో కొంత సమయం సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే అనేక కార్యాల మీద మనసు పెట్టబడుతుంది. ఎంత ఎక్కువగా మీరు లోకానుసారమైన కార్యాన్ని వెతుకుతూ వెళ్తున్నారో అంత త్వరగా అది ఇంకా కావాలి ఇంకా కావాలి అని దప్పికను కలుగజేస్తుందే తప్ప తృప్తిని ఇవ్వనే ఇవ్వదు ఇదే సత్యం. 

 

కానీ యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు శ్రమలు శ్రమించి మరణించిన ఇంత గొప్ప రక్షణ గురించి మనకు శ్రద్ధ లేకుండా ఉండిన యెడల మనము ఆయన ఇచ్చే సంతోషాన్ని సమాధానాన్ని రక్షణను మన హృదయంలో పొందకుండా పోతాం కాబట్టి సులువుగా ఆయన మీద నమ్మకం పెడదాం. ఆయన ఇచ్చే సంతోషము సమాధానం నిరీక్షణను మన హృదయంలో నింపుకుందాం. 

- ఎస్. బెర్లిన్ సెల్లబాయి గారు 

 

ప్రార్థన అంశం: 

మన ఆఫీసు పనుల కొరకు అందులో పని చేసే మిషనరీల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş holiganbet giriş çarkbet çarkbet giriş