Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.07.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 02-Jul-2023

దిన ధ్యానము(Telugu) 02.07.2023 (Kids Special)

 

అంశం: దేవుడు చూచుకొనెను

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?" - మత్తయి 6:26

 

హలో పిల్లలు! ఎలా ఉన్నారు? కొత్త క్లాస్, కొత్త టీచర్లు దొరికారా? చాలా హ్యాపీగా ఉన్నారా? మంచి డ్రెస్ లేదే, నేను కోరుకున్న ఆహారం దొరకలేదే ఈ సంవత్సరం చదువుని ఎలా ముగించబోతున్నాను అని చింతిస్తున్నారా? డోంట్ వర్రీ మీ పరమ తండ్రి అన్నింటిని చూసుకుంటారు. ఓకే పిల్లలు కథ విందామా? 

 

అందమైన పొలాలు, ఇల్లు, ఆవులు, కోళ్లు, బాతులు, అని గ్రామంలో జీవితం చాలా అందంగా ఉంటుంది కదూ. ఒక ఇంట్లో చాలా కోడి పిల్లలు ఉండేవి. అవి పక్కనే ఉన్న పొలానికి వెళ్లి ఎదిగి ఉన్న ధాన్యమును పొడుస్తూ తిని చక్కగా పడుకుంటూ ఉండేవి. ఒక దినాన ఆ పొలానికి ఆ పొలం యొక్క యజమానుడు వచ్చి చూశారు. మంచిగా పండి ఉన్న ధాన్యము కోతకు సిద్ధంగా ఉన్నది దీనిని ఇంకా రెండు దినాలలో ఈ పొలంలో గల ధాన్యమును కోసి ఇంటికి తీసుకుని వెళ్ళపోవచ్చు అని సెల్ఫోన్లో తన భార్యతో మాట్లాడుతున్నారు. ఇవి కోడి పిల్లలు విన్నాయి. 

 

అమ్మ అమ్మ అని పిలిచి గబగబా పరిగెత్తుకొని వెళ్లాయి కోడి పిల్లలు. ఇంత త్వరగా ఎక్కడ నుండి పరిగెత్తుకుని వస్తున్నారు అని అమ్మ అడిగింది. ఆ యజమానుడు మాట్లాడిన దాన్ని అమ్మకు వివరించాయి. సరే ఇంక రెండు రోజులు ఉన్నాయి కదా చూసుకొనవచ్చును అని తల్లి కోడి చెప్పింది. రెండు దినాలు అయిపోయాయి. ఆ కోడి పిల్లలు చాలా చింతతో కడుపునిండా తినుటకు ఆహారం లేకుండా పోయిందే అని బాధపడుతూ ఉండేవి. రేపు తినుటకు ఏమి చేద్దాము అని అమ్మ అమ్మ అని పిలుస్తూ అడుగుతున్నాయి అ కోడి పిల్లలు. తల్లి కోడి మరియొక స్థలమునకు తీసుకొని వెళ్ళింది. అక్కడ కడుపునిండా తిన్న కోడి పిల్లలు ఇలాంటి స్థలము కూడా ఉన్నదా అని ఆశ్చర్యపడ్డాయి. అమ్మ ఉంటుండగా చింత ఎందుకు అని కోడి పిల్లలు సంతోషంగా ఉన్నాయి. 

 

ఏంటి పిల్లలు కోడి తన పిల్లలను చక్కగా పరామర్శించిన యెడల మరి మన పరమ తండ్రి మన కార్యాలను చూసుకోనలేరా? కచ్చితంగా నీ ఆశలు తీరుస్తారు. కలవర పడకుడి, చింతించకుడి. సరైన పిల్లలు బాయ్ !

- సిస్టర్. దెబోరా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet