Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.07.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 05-Jul-2023

దిన ధ్యానము(Telugu) 05.07.2023

 

అంశం: కృతజ్ఞతతో

 

"నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" - కీర్తనలు 103:2 

 

దృష్టి లేని ఒక చిన్న బాలుడు రద్దీ అయినా ఒక స్థలములో కూర్చుని బిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆయన పక్కనే ఒక బోర్డు పైన నేను గుడ్డివాడిగా ఉన్నాను నాకు సహాయం వచ్చేయండి అని రాయబడి ఉంది. దాని పక్కనే కొందరు వేసిన చిల్లర నాణెములు కనబడ్డాయి. ఒక మనిషి కొన్ని నాణెమును తీసి ఆయన ముందు పెట్టబడి ఉన్నా ఆ పాత్రలో వేసేసి ఆ బాలుడు పక్కనే ఉన్న ఆ బోర్డు పైన ఏదో రాశారు. కొంత సమయం తర్వాత ఆయన పాత్ర నాణెములతొ నిండిపోయింది. కొందరు నిలబడి ఆయనకు డబ్బులు ఇచ్చి వెళ్లారు. సాయంకాల సమయంలో ఆ బోర్డును మార్చి రాసిన మనిషి ఏమి జరుగుతుందో అని తెలుసుకొనుటకు వచ్చారు. ఆయన అడుగులు చప్పుడు వినబడి ఆయనే అని గ్రహించిన బాలుడు అయ్యా మీరు ఎవరు? నా బోర్డు పని ఏమి రాశారు? నాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అని అన్నాడు. 

 

అందుకు ఆయన నేను నిజాన్నే రాశాను. నీవు రాసిన దాన్ని కొంత మార్చి రాశాను అని అన్నాడ . అందుకు ఆ బాలుడు ఏమి రాశారో చెప్పండి అని అన్నాడు. అందుకు ఆయన ఈ దినము ఒక ఇంపైన దినము, అందమైన దినము నేను దాన్ని చూడలేకపోతున్నాను. మీరు ఈ లోకాన్ని అనుభవించండి మీరు ధన్యులు అని రాశాను అని అన్నాడు. దానిని చదివిన వారు వారి యొక్క ధన్యతను గుర్తించి వారి యొక్క హృదయము కృతజ్ఞతతో నిండింది. దేవుడిచ్చిన ఆరోగ్యం కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. 

 

అవును అనేక సందర్భాల్లో ప్రభువు మనకు ఇచ్చినటువంటి కార్యములకు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి అనే తలంపు లేకుండా ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన దినాల్లో పదిమంది కుష్టు రోగులు అద్భుతమైన సుఖము కొరకు ఆయన వెతుక్కుంటూ వచ్చి బోధకుడా మమ్మల్ని కనికరించండి అని కేకలు పెట్టారు. వెంటనే యేసయ్య మాట చొప్పున ఆ పదిమంది కూడా అద్భుతమైన స్వస్థత పొందుకున్నారు కానీ ఆ పది మందిలో ఒకరు మాత్రమే తిరిగి వచ్చి యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లించారు. 

 

అవును ప్రియమైన వారలారా! మన ప్రభువు మన యొద్ద ఏమి ఎదురు చూస్తున్నారు? ఆయన మన కొరకు కల్వరి సిలువలో మరణించడం ఎందుకు? కేవలము ప్రేమ కొరకు మాత్రమే. కానీ మనము కృతజ్ఞతలు లేనివారముగా ఉంటున్నాం. మన చేతుల్లో ఇవ్వబడిన దీవెనల కొరకు ఆరోగ్యము కొరకు ప్రతి దినము కృతజ్ఞత కలవారిగా ఉండాలి. లేని వాటి కొరకు తపన పడుట కంటే ఉన్నవాటి కొరకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. మంచి ఆరోగ్యము కొరకు మనం ప్రతిరోజు చేసిన పనుల కొరకు ఆయన వలన పొందుకున్న రక్షణ, అభిషేకము వీటన్నిటి కొరకు ప్రతి నిమిషం కూడా కృతజ్ఞత గలవారుగా జీవిద్దాం. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

ఆమెన్ విలేజ్ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా అనేకులు దేవుని ప్రేమను ఎరుగులాగును ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet esbet holiganbet tambet grandpashabet betgit radissonbet