Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.03.2021
Share:

By Village Missionary Movement

Monday, 15-Mar-2021

దిన ధ్యానము(Telugu) 15.03.2021

తండ్రి హృదయము.

"వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను" - లూకా 15: 20

కొత్త కారును తీసుకువచ్చి నాన్న ఇంటి ముందు నిలబెట్టి ఇంటిలోనికి వచ్చారు. పెద్ద కుమారుడు కారు చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటే 4 సంవత్సరాల వయస్సు గల తన తమ్ముడు ఒక చిన్న రాయి తీసుకొని ఆ కారు డోర్ మీద బొమ్మ గీయడం ప్రారంభించాడు. దానిని చూసిన పెద్ద కుమారుడు కోపముతో పక్కనే ఉన్న చిన్న ఇనుప ముక్కను తీసి తన తమ్ముడు చేతి వేళ్ళు పైన బలముగా కొట్టాడు. ఆ శబ్దమును విని బయటకు వచ్చి తన చిన్న కుమారుడ్ని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అతనిని చూసిన డాక్టర్ తన వేళ్ళు బాగుపడటానికి చాలా కాలం పడుతుంది అని చెప్పారు. తండ్రి పెద్ద కుమారుడ్ని చూసి కారు పై గీత పడుతుంది అని నీ తమ్ముడి చేతి వేళ్ళను పాడుచేసావే అని అన్నారు. కారు అద్దము కంటే, తలుపు కంటే మీ తమ్ముడి చేతి వేళ్ళు ప్రముఖ్యము కాదా  అని అడిగారు. కాని దానికి పెద్ద కుమారుడు మౌనముగా ఉండిపోయాడు. 

బైబిల్లో లూక సువార్త 15 వ అధ్యాయంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు కలరు. వారిలో చిన్న వాడు ఆస్తిలో భాగాన్ని తీసుకొని తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఒకానొక దినమున ఉన్నది అంత ఖర్చు పెట్టేసిన తరువాత తినడానికి కూడా ఏమిలేక పందులకు వేసే పొట్టుకూడా దొరకని పరిస్థితి వచ్చినప్పుడు తన మనస్సు మార్చుకొని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి తనను కౌగలించుకొని చేర్చుకొని సంతోషిస్తున్నారు. కాని పెద్ద కుమారుడైతే తన సహోదరుడ్ని అంగీకరించలేకపోయాడు. 

దీనిని చదువుతున్న స్నేహితులారా! ప్రస్తుత లోకంలో ఒకరి తప్పిదమునకు శిక్ష విధించుటకు ముందు ఉంటున్నాము. కాని తండ్రి హృదయము గలవారు అనేకులు లేరు పాపము చేసి మారుమనస్సు పొంది  దాంట్లోనుండి బయటకు రావాలని మంచిగా జీవించాలి అని తలంచే చిన్న కుమారుడు వలె అనేక యవ్వనస్తులు, పెద్దలు ఉన్నారు. కాని వాళ్ళను అంగీకరించకుండా పెద్ద కుమారుడు వలె అనేకులు వాళ్ళను పక్కన పెడుతున్నారు. కాని మనము తండ్రి వలె ప్రతి ఒక్కరినీ అంగీకరించి, ఆదరించాలి. అవును ప్రతి క్రైస్తవునికి ఉండవలసినది తండ్రి యొక్క హృదయమే.
-    బ్రదర్. ఎజ్రా

ప్రార్థన అంశం:-
పీస్ సెంటర్ కట్టడ పనులు త్వరగా ప్రారంభించ బడుటకు, దానికి కావలసిన అవసరములు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet