Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.07.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 11-Jul-2023

దిన ధ్యానము(Telugu) 11.07.2023

 

అంశం: రేపు చూసుకోవచ్చు

 

“దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను” - హెబ్రీయులకు 2:4

 

గ్రీసు దేశానికి చెందిన రాజులలో ఆగ్నేయస్ అనే రాజు ఒకరు. ఈయన తన దేశ ప్రజల మీద ఎంత మాత్రమూ శ్రద్ధ లేకుండా జీవించారు. అన్ని విధములైన పాపములతో జీవిస్తూ వచ్చారు. ఈయన దేశంలో ఎలాంటి అభివృద్ధి లేదు. రాజు యొక్క బాధ్యతలేని పరిపాలన వలన దేశము కీడువైపు వెళ్ళిపోయింది. ఇందువలన ఆ దేశ ప్రజలే సహనం కోల్పోయిన వాళ్లుగా రాజుని చంపుటకు ప్రణాళిక వేశారు. ఈ ప్రణాళికను నెరవేర్చుటకు తగిన సమయాన్ని ప్రజలు వెతుకుతూ వచ్చారు. ప్రజలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు తనను చంపుటకు ప్రణాళిక వేస్తున్నారు అనే దానిని గ్రహించలేని వాడిగా ఇంకను అధికముగా చెడు కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈయన దగ్గర ఉన్న స్నేహితుని ద్వారా ఉత్తరములు ద్వారా రాజు యొక్క హత్య ప్రణాళిక గురించి రాయబడింది. ఆ పరిస్థితిలో కూడా రాజు ఆ ఉత్తరమును తీసి చదవలేని వాడిగా దానిని రేపు చూసుకుందాం అని అశ్రద్ధ చేశాడు. ఆ పరిస్థితిలో విందుకు పిలవబడిన వారిలో కొందరు రాజు మీద పడి ఆ రాజును చంపివేశారు. రాజు యొక్క మరణమునకు ఆయన రేపు చూసుకోనవచ్చును అని ఉండిన తన యొక్క అశ్రద్ధే కారణమైంది. 

 

పాత నిబంధన గ్రంధంలో దేవుని దాసుడైన ఇస్సాకుకు ఇద్దరు పిల్లలు కలరు. ఏసావు మరియు యాకోబు. దీంట్లో పెద్దవాడైన ఏసావు తను జేష్ట భాగమును పొందుకొనుటకు అశ్రద్ధ చేసి ఒక పూట ఆహారము కొరకు దానిని అశ్రద్ధ చేశాడు. మరియు యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 25 లో చెప్పిన ఉపమానంలో ఒక తలాంతు పొందుకున్న వాడు దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించకుండా దాన్ని అశ్రద చేశాడు ఫలితము నరకము అని చూస్తున్నాం. 

 

ప్రియమైన వారలారా! పాపము చేస్తున్న ఆత్మ మరణము పాలవును అని యెహేజ్కేలు 18:14 లో రాయబడింది. పాపం యొక్క జీతము మరణము రోమీయులకు వ్రాసిన పత్రిక 6:23 ఇలా బైబిల్ మనలను హెచ్చరిస్తూ ఉంది. దేవుడు మనకు కృపగా ఇచ్చిన ప్రతి దినాన్ని ప్రతి అవకాశాన్ని వెంటనే వాడుకుందాం. రేపు చూసుకుందాం తర్వాత చూసుకోవచ్చు అనే దానిని దాటి వేయకుండా అశ్రద్ధ చేయకుండా వెంటనే చేసి ముగిద్దాం. దేవుడు మనకు కృపగా ఇచ్చిన బలాన్ని పొందుకొని జీవిద్దాం. 

 

ప్రార్థన అంశం:

ఆగస్టు 15లో తిరునల్వేలి లో జరగబోతున్న యవ్వనస్తుల కూడిక సిద్ధపాటు పనుల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş matbet giriş matbet matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom giriş deneme bonusu casibom vaycasino vaycasino giriş meritking meritking giriş cratosroyalbet realbahis realbahis giriş casibom casibom giriş casibom casibom giriş imajbet imajbet giriş imajbetapp grandpashabet grandpashabet giriş grandpashabet güncel bets10 bets10 giriş bets10 güncel giriş matbet matbet giriş alobet betmartin pashagaming ultrabet lunabet betzula meritking jojobet jojobet jojobet jojobet jojobet betgit radissonbet grandpashabet romabet nesinecasino grandpashabet casibom