Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.07.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 12-Jul-2023

దిన ధ్యానము(Telugu) 13.07.2023

 

అంశం: జగడమాడకము

 

"నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయ క్రియలు నాకు కనబడు చున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచు కొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?" - యిర్మియా 13:27

 

న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఇశ్రాయేలు ప్రజల కొరకు మిద్యానీయులతో యుద్ధముచేస్తూ దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన దానిని మనం చూస్తున్నాం. ఆ సంఘటన న్యాయాధిపతులు 8వ అధ్యాయంలో ఎఫ్రాయిము మనుషులు అతన్ని చూసి నీవు మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు ఇలా నీవు మాకు చేసింది ఏమిటి అని ఆయనతో బలమైన వాదనకు దిగారు అని చదువుతున్నాము. అనగా ప్రభువు దర్శనము పొందుకొని గిద్యోను ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు యుద్ధము చేస్తున్నాడు. ఇప్పుడు ఆ యొక్క యుద్ధంలో పొందుకొనిన విజయం కొరకు దేవునిని మహిమ పరిచి గిద్యోనును ఘనపరచవలసినది పోయి ఎఫ్రాయిము మనుషులు ఆయన మనసును నిరుత్సాహపరిచే విధంగా వాదన చేసిన దాన్ని చూస్తున్నాం. ఆ సంఘటనలో గిద్యోను ఎఫ్రాయిము మనుషుల మధ్య తనను తగ్గించుకొని ప్రభువు ఎదుట తన్నుతాను కాపాడుకున్న దాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈ ఎఫ్రాయిము ప్రజలు తరచుగా జగడమాడుతున్నవారు గానే ఉంటున్నారు. న్యాయాధిపతులు 12 వ అధ్యాయములో మొదటి వచనంలో చూసిన యెడల ఎలా గిద్యోనుతో జగడ మాడారో అలానే యెఫ్తా యొద్ద కూడా ఎందుకు మమ్ములను యుద్ధమునకు పిలవలేదు అని జగడమాడుటకు వెళ్తున్నారు కానీ యెఫ్తా అయితే గిద్యోను వలె తగ్గించుకొని వెళ్లలేదు మారుగా ఎఫ్రాయిము మనుషులతో కోపముగా మాట్లాడి తన మనుషులను పంపించి వాళ్లతో యుద్ధానికి వెళ్తున్నాడు. దీని ద్వారా ఎఫ్రాయిము మనుషులు అనేకులు పతనమయ్యారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మన జీవితంలోని తరచుగా ఎఫ్రాయిము మనుషులు వలె జగడమడే వారిగా ఉంటూ ఉంటే పతనం కచ్చితం. సమాధానపరిచే వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని యేసుప్రభు చెప్పిన ప్రకారము మనము సమాధాన పరిచే వారిగా మారిన యెడల ధన్యులుగా పిలవబడుతాం. ప్రభువు మనల్ని కచ్చితంగా హెచ్చిస్తారు. 

 

కాబట్టి తరచుగా పోట్లాడేవారుగా ఉండకుండా నశించి పోయిన ఎఫ్రాయిము వలె కాకుండా యేసు ప్రభువు చెప్పిన సహన గుణాన్ని కలిగిన వారిగా సమాధానపరిచే వారిగా జీవించి ఈ భూమిని స్వాతంత్రించుకుందాం. ప్రభువు నామము మహిమపరచబడును గాక! ప్రభువు మనల్ని దీవించును గాక అనే వాక్యానుసారముగా మనము హెచ్చింపబడుట కచ్చితం. 

- బ్రదర్. బెంజిమెన్ గారు 

 

ప్రార్థన అంశం: 

మన ఫీల్డ్ లో జరుగుతున్న ఏరియా ప్రార్థన గుంపులు ఆటంకం లేకుండా జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler holiganbet holiganbet giriş holiganbet güncel giriş enbet enbet giriş enbet güncel giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş meritbet meritbet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet nakitbahis matbet matbet çorlu escort çorlu escort meritking meritking giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş perabet meritking meritking giriş meritking meritking giriş pulibet pulibet giriş jojobet jojobet giriş jojobet güncel giriş Superbetin superbetin giriş hızlıcasino hızlıcasino giriş holiganbet holiganbet giriş bahsegel perabet perabet giriş süperbetin superbetin süperbetin giriş Padişahbet superbetin giriş Padişahbet Giriş casibom casibom giriş deneme bonusu deneme bonusu veren siteler deneme bonusu deneme bonusu veren siteler meritking meritking giriş meritking güncel giriş casibom süperbetin superbetin süperbetin giriş superbetin giriş Egebet