Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.07.2023
Share:

By Village Missionary Movement

Monday, 24-Jul-2023

దిన ధ్యానము(Telugu) 25.07.2023

 

అంశం: నోటి మాట

 

"సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతో షము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము" - సామెతలు 15:23

 

పాత నిబంధన గ్రంథములో మొర్దెకై ఎస్తేరుతో నీవు ఈ కాలంలో మౌనంగా ఉండనయడల యూదులకు రక్షణ మరియొక చోట నుండి వచ్చును. నీవు ఇలాంటి కాలమునకు సహాయపడుటకే నీకు ఇలాంటి ఘనత దొరికి ఉండి ఉండవచ్చు కదా ఎవరికి తెలుసు అని చెప్పిన మాటలు ఎస్తేరును ఉపవాసం చేయుటకు, చట్టాన్ని అధిగమించి రాజు వద్దకు ప్రవేశించే ధైర్యాన్ని ఇచ్చాయి. దాని ద్వారా యూదా జనాంగము పెద్ద ప్రమాదం నుండి తప్పించబడింది. 

 

నెబుకద్నేజరు ఏర్పాటు చేసిన బంగారు ప్రతిమకు నమస్కరించుటకు తిరస్కరించిన యెడల అగ్నిగుండంలో వేయబడాలి అని శిక్షణ పొందుకున్న షడ్రక్ మేషక్ అబేద్నగో అనేవారు రాజు వద్ద మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని తప్పించుటకు శక్తివంతుడు అని చెప్పిన మాటలు ప్రకారము దేవుడు వాళ్ళని తప్పించారు. అందునుబట్టి రాజు నిజమైన దేవున్ని మహిమ పరచగలిగారు, ఆ ముగ్గురు ఆ దేశంలో రక్షించబడ్డారు. 

 

కొత్త నిబంధనలో ఒక కానాను స్త్రీ తన కుమార్తె అపవాది చేత పీడించబడుతున్న సమయంలో విడుదల కొరకు యేసయ్యను అడిగినప్పుడు పిల్లలు యొక్క రొట్టెను తీసి కుక్కపిల్లలకు వేయుట మంచిది కాదు అని చెప్పారు. కానీ ఆ స్త్రీ కుక్క పిల్లలు బల్లపై నుండి కింద పడుతున్న రొట్టె ముక్కలని తింటున్నాయి కదా అని చెప్పినందున ఆమె విశ్వాసాన్ని యేసయ్య ఘనపరిచేటట్లు చేసింది మరియు ఆమె బిడ్డకు విడుదల దొరికింది. 

 

యేసయ్య సిలువలో వేలాడినప్పుడు ఒక దొంగ ప్రభువా మీరు మీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని తగిన సమయంలో చెప్పిన మాట ఆయనకు పరదేశంలో నిత్యమైన సంతోషాన్ని తీసుకుని వచ్చింది. 

 

ప్రియమైన వారలారా! పైన చెప్పబడిన లేఖనాల ప్రకారం మనుషులు వారి నోటి మాట చేత సంతోషము కలిగించు కొనుటయు తగిన కాలంలో మాట్లాడబడిన మాటలు ఎంత మంచి చూపిస్తున్నాయి. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నది. మన హృదయము దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు మాట అయినటువంటి దేవుడు మన హృదయంలో పరిశుద్ధాత్మునిగా నిండి ఉంటారు. అప్పుడు మాట్లాడుతుంది మనము కాదు ఆత్మ దేవుడే మాట్లాడుతారు. మనము దేవుని యొద్దను మనుషుల యొద్దను మాట్లాడుతున్న మాటలు మనకు సంతోషాన్ని కలిగిస్తుంది తగిన సమయంలో మనం మాట్లాడుతున్న మాటలు మనకు మిక్కిలి మేలును తీసుకొస్తుంది. 

- శ్రీమతి. గీతా రీఛార్జ్ గారు

 

ప్రార్థన అంశం: 

ఆంధ్రలో కట్టబడుతున్న ఆలయ కట్టడ పనులు పూర్తయ్యేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort