Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.08.2023
Share:

By Village Missionary Movement

Friday, 04-Aug-2023

దిన ధ్యానము(Telugu) 05.08.2023

 

అంశం: మణిపూర్

 

“చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను” - మత్తయి 4:15

 

భారతదేశం గల చిన్న రాష్ట్రం మణిపూర్. 1972వ సంవత్సరం జనవరి 21వ తారీఖున ప్రభుత్వము దీనిని ఒక రాష్ట్రంగా విభజించింది. ఈ రాష్ట్రంలో మైతి, నాగ, కుక్కి, సిమీసో అనే ప్రజలు జీవిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మణిపూర్ భాష మాట్లాడుతూ ఉండేవారు. ఇక్కడ విత్తబడిన సువార్త యుద్ధము చేస్తున్న ఆదివాసి ప్రజలను నెమ్మదిగలిగిన వారిగా మరియు విశ్వాసులుగా మార్చింది. 

 

యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త ఈ రాష్ట్రానికి రెండు భాగాల నుండి వచ్చింది. మొదటిది ఉత్తర భాగము నుండి నాగ ప్రజలను ఆకర్షించింది. రెండవది దక్షిణ భాగము లో గల మిజోరం నుండి కుక్కి మరియు సిమీసో ప్రజలను చేరుకున్నది. 1894 వ సంవత్సరం 'విలియం పెట్టిక్ యు' అనే మిషనరీ మణిపూర్ క్యాపిటల్ అయినా ఇంపాల్ కు వచ్చి మొట్టమొదటిగా అక్కడ నివసిస్తున్న ఆదివాసి ప్రజలకు సువార్త ప్రకటించాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించాడు. విద్యతోపాటు క్రీస్తు ప్రేమను కూడా ప్రకటించగలిగాడు. ఉగ్రూల్ అనే స్థలంలో తన మిషనరీ పనిని ప్రారంభించారు. ఆరు సంవత్సరములు ఆయన పడిన ప్రయాసవలన 12 మంది విద్యార్థులు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించ గలిగారు. 1926 లో ట్యాంకుల్ అనే భాషలో ఇంగ్లీష్ బైబిల్ ను తర్జుమా చేసి బొంగియో అనే భాషలో ముద్రించుటకు ఈయన కారకుడు అయ్యాడు. ఈయన తర్వాత అనేక మంది క్రైస్తవ మిషనరీలు పని చేయడం వలన సువార్త అనేది ప్రబలడం ప్రారంభించింది. 

 

భారతదేశంలో ఏడుగురు సహోదరీలు అని పిలవబడుతున్న దక్షిణ తూర్పు రాష్ట్రంలో ఒకటి ఈ మణిపూర్. ఈ రాష్ట్రంలో 41 శాతం మంది క్రైస్తవులు జీవిస్తున్నారు. అంతమంది క్రైస్తవులు ఉన్న ఈ రాష్ట్రంలో గడిచిన నెల రోజులుగా జరుగుతున్న అల్లరి వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దినపు యవ్వన సమాజం ఇలాంటి ప్రజల మధ్యన పరిచర్య చేయడానికి మనం ప్రార్థిద్దాం. నాతోటి 

 జతపనివారైన ప్రిస్కిల్ల, అకుల అనే వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి (రోమీయులకు 16:3) అని పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు మనము కూడా ఇలాంటి కఠినమైన ప్రాంతమునకు వెళ్లి పరమ దేవుని యొక్క ప్రేమను ప్రకటిద్దాం. మణిపూర్ యొక్క రక్షణ కొరకు సమాధానము కొరకు ప్రార్థించుట మన బాధ్యత కదూ! 

- బ్రదర్. భాగ్యనాధన్ గారు 

 

ప్రార్థన అంశం:-

తిరునల్వేలి యవనస్తుల ఉజ్జీవ క్యాంపులో సిద్ధపాటు పనులు కొరకును మరియు అనేకమంది కనికరము దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort