Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.08.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 12-Aug-2023

దిన ధ్యానము(Telugu) 13.08.2023 (Kids Special)

 

అంశం: ఉజ్జీవ ప్రార్థన 

 

"దేవుని మూలముగా పుట్టిన వారందరును(పుట్టినదంతయు లోకమును జయించును) లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే" – 1 యోహాను 5:4 

 

 దట్టమైన అడవి గల ఒక గ్రామం కొండ మీద ఉన్నది. అక్కడ కరెంటు సదుపాయం, హాస్పిటల్ ప్రయాణ సదుపాయం, స్కూల్స్ ఇలాంటివి ఏమీ లేవు. ఆలోచించండి ఎంత కష్టంగా ఉంటుంది పిల్లలు మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా అందుకొరకు యేసయ్యకు వందనములు చెల్లించాలి. సరైన పిల్లలు! 

 

అక్కడ ఉన్న ప్రజలు పూసలతో చేసిన దండలు వేసుకుంటారు. శరీరంలో ఎలాంటి అనారోగ్యం వచ్చినా మంత్రగాడి వద్దకు వెళ్లి చెప్పేది వింటారు. కొన్నిసార్లు వాడు చెప్పిన పనులు చేయమంటాడు, అగ్నిలో కాల్చిన ఇనుమును పెట్టి కాల్చి వేస్తాడు, కొన్నిసార్లు తాళ్లు కట్టుకోమని చెబుతాడు, తరచుగా బలి కూడా ఇవ్వమని చెప్తూ ఉంటాడు. ఆ గ్రామంలో ఇవా, ఏమి అనే ఇద్దరు చిన్నారులు ఉండేవారు. హఠాత్తుగా ఇవాకు జ్వరం వచ్చింది. తండ్రి ఆ మంత్రగాడు వద్దకు తీసుకుని వెళ్లారు. ఆ మంత్రగాడు ఏం చేశాడో తెలుసా? బాగా కాలుతున్న ఇనుమును తీసి ఇవా నుదుటిమీద చిన్న ముద్ర వేశాడు. ఆ ప్రాంతమంతా కాలిపోయింది. ఆ బాధ భరించలేకపోతున్నానే అని బాధపడింది. నొప్పి ఒకపక్క మరొకవైపు జ్వరం ఒకపక్క అప్పుడు ఆ మంత్రగాడు ఇలా చెప్పాడు జ్వరము తగ్గకపోతే బలి అర్పించవలసి ఉంటుంది అని చెప్పాడు. ఆ సమయంలో ఎవరో ఒకరు ప్రాంతానికి వచ్చి యేసయ్య గురించి చెప్పి బైబిల్ వారికి ఇచ్చారు. ఆ గాయమునకు మందు కూడా ఇచ్చి ప్రార్థించి వెళ్ళారు. కొద్ది కొద్దిగా జ్వరం తగ్గడం ప్రారంభించింది. పుండు కూడా మానడం ప్రారంభించింది. ఇంకొకపక్క బలి ఇవ్వాలి అనే సిద్ధపాటు చేస్తున్నారు. ఇవా మరియు ఏమి ఇద్దరు కూడా యేసయ్యకు ప్రార్థించారు కొన్ని గంటల్లోనే జ్వరం తగ్గిపోయింది, కాల్చబడిన ఇనుము చేత వేయబడిన ఆ ముద్ర వలన ఏర్పడిన పుండు కూడా మానిపోయింది. దానిని చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఎలా ఇంత అద్భుతం జరిగింది అని అడిగినప్పుడు యేసయ్య దగ్గర మేము ప్రార్ధించాము ఒక వెలుగు వచ్చి నా మీద పడిన వెంటనే నేను బాగా అయ్యాను అని ఇవా చెప్పిన మాట వినిన వెంటనే నాన్నకు అమ్మకు చాలా సంతోషం అనిపించింది. ఆ మంత్రగాడు కూడా జరిగిన సంఘటన వాళ్ళ ఇంటికి వచ్చి తెలుసుకున్నాడు. ఆరోగ్యం ఇచ్చే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఆ గ్రామమే యేసయ్యను తెలుసుకొని ఆ బలి చెల్లించే అలవాటును మానుకున్నారు. 

 

హలో పిల్లలు! ఇవా, ఏమి ఇద్దరు కూడా యేసయ్య గురించి విని ప్రార్థించడం వలన ఎంత గొప్ప మార్పు వచ్చిందో చూశారా? ఇలాగే ప్రజల కొరకు మీరు కూడా ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ మధ్యలో గొప్ప మార్పును ఉజ్జీవాన్ని తీసుకుని వస్తారు. హల్లెలూయ! 

- శ్రీమతి. జ్యోతి స్టాలిన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet perabet giriş perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz matbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel matbet romabet lunabet