By Village Missionary Movement
Tuesday, 15-Aug-2023దిన ధ్యానము(Telugu) 15.08.2023
అంశం: నిజమైన విడుదల
"అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" - యోహాను 8:34
మన భారత దేశంలో 76వ స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటున్న ఈ సమయంలో నిజమైన విడుదల ఏమిటి అనేదాన్ని ధ్యానిద్దాం. మన దేశ ప్రజలు లోక అధిపతి అయిన సాతానుకు బానిసగా ఉన్నామని గ్రహించకుండా తమ స్వేచ్ఛతో ఉన్నామని తమ మనసులో ఉన్న కోరికలు కోరుకున్నట్టు చేయుటకు సంపూర్ణ హక్కు తమకు ఉన్నదని తలంచి విస్తారమైన ఘోరమైన పాపమునకు, పాప అలవాట్లకు బానిసలై ఉన్నారు. హోమో సెక్స్ వంటి పాపములు చేయుటకు హక్కు అడుగుతూ పోరాటంలో పాల్గొంటున్నారు.
ఒక మనిషికి ఎలుగుబంటితో నాట్యం చేయించుటకు నాట్యమును నేర్పించి నాట్యం చేయిస్తూ దాని ద్వారా డబ్బులు సంపాదిస్తూ వచ్చారు. ఆ ఎలుగుబంటి పొందిన దెబ్బలు ఇంత అంత కాదు. ఆ ఎలుగుబంటి అతని నుండి తప్పించుకొని అడవిలోనికి పారిపోయిన ఎలుగుబంటి తనను ఇతర జంతువులు కంటే గొప్పగా కనపరచుకొనుటకు నేర్చుకున్న నాట్యమును వేసి అందర్నీ మెప్పింపజేసింది. ఒక దినం మిక్కిలి వయసుగల ఎలుగుబంటి నీవు బానిసగా ఉండి దెబ్బలు కాసి పొందుకున్న ఈ నాట్యమును నాకు గొప్పగా చూపిస్తున్నావా అని అన్నదంట. ఆ దినము నుండి ఆ ఎలుగుబంటి నాట్యము చేయడము మానివేసింది. ఆ ఎలుగుబంటి కూడా తెలిసింది నేను బానిసగా ఉన్నాను అని. సాతాను ఖైదీలుగా ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము పాపమునకు బానిసలుగా ఉండిన మనుషులైతే తమ స్వేచ్ఛను తలంచుకొని గ్రహింప లేకుండా జీవిస్తూ ఉన్నారు. సాతాను పాప బానిసలో నుండి విడిపించగల ఒకే ఒక దైవము యేసుక్రీస్తు మాత్రమే.
పూర్వపు అమెరికా రాష్ట్రపతి అయిన జాన్ కెనడీ దేశము మనకి ఏమి చేసింది అని అడగకు మనము దేశం కొరకు ఏమి చేయాలి అని అడగండి అన్నారు. మనము మన దేశ ప్రజలు సాతాను యొక్క బానిసత్వం నుండి విడిపించబడి క్రీస్తు యొక్క దాసులుగా మారాలి అని ప్రార్థించి జయం పొందుకొనుటయే మనము దేశమునకు చేసిన గొప్ప కార్యం. కోట్లాదిమంది ప్రజలు గల మన దేశంలో మన చుట్టూ గుంపుగా కనిపిస్తున్న ప్రజలకు దేవుని ప్రేమను ప్రకటించే ఈ బాధ్యతను చేస్తామా లేదా అని దేవుడు ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయనకు లోబడదామా? ఈ ప్రార్థన పరిచర్య చేసి అన్నిచోట్ల అన్నివేళల్లో కూడా రోజు ప్రార్ధన చేద్దామా?
శ్రీమతి. గీతా రీఛార్జ్ గారు
ప్రార్థన అంశం:
ఈ దినం పాలేయం కొట్టయిలో జరుగుతున్న యవ్వనస్తుల ఉజ్జివ కూడికలో అనేక మంది యవ్వనస్తులు పాల్గొనేటట్ల ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250