Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.08.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 16-Aug-2023

దిన ధ్యానము(Telugu) 17.08.2023

 

అంశం: ఏది ఘనత

 

"దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు" - కీర్తనలు 8:5

 

ఈ దినములలో మనిషికి ఘనతన ఇవ్వగలిగినది లేదా ఉన్నతమైన స్థితిని ఇవ్వగలిగేది ఏది అని ధ్యానిద్దాం. మనము జీవించే సమాజంలో ఒకని యొక్క గుణాతిశయములకు ఇచ్చే మర్యాద కంటే ఆయన ధరించే వస్త్రములకు ఆయన నివసించే ఇంటికిని అధిక ఘనత ఇవ్వబడుతుంది. ఒకరికి ఉన్న సంపాదన వాడికి ఉన్న కారు ఇవే వాడి యొక్క ఘనతను పెంచుతున్నట్లుగా కనబడుతుంది. కానీ నిజం ఏమిటంటే మనిషి యొక్క సత్క్రియలు మంచి గుణాతిశయాలే ఆయన యొక్క ఘనతను పెంచుతుంది. 

 

దీని గురించి మంచి కుటుంబ సలహాదారుడైన మైలో ఆర్నాల్డ్ ఇలా రాస్తున్నారు. అనేక మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే తమ పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నారు. సమాజంలో తమ పిల్లలకు మంచి వస్త్రములను ధరించుటకు వాళ్లను బలవంతం చేస్తున్నారు. పిల్లలు యొక్క వసతి కంటే తల్లిదండ్రుల యొక్క సంతృప్తి ప్రాముఖ్యంగా చూపించబడుతుంది. ఇలా పెంచబడుతున్న పిల్లలు రెండు విధాలుగా ఇబ్బంది పడతారు 1.ఎక్కువగా బట్టలు గురించే ఆలోచన కలిగి ఉంటారు 2. ఇతరులను ఆకర్షించాలి అంటే మంచిగా వస్త్రాన్ని ధరించాలి అని తప్పుడు ఆలోచన కలిగి ఉంటారు. తనను ఎవరూ గమనించలేదు అంటే ఒక విధమైన ఆత్మహీనతకు గురి అవుతున్నారు. ఆ బిడ్డ అలా ఉంటే వివాహమైన తర్వాత తన యొక్క వస్త్రములు కొరకు వ్యర్ధముగా ధనమును ఉపయోగించి తన భర్తను అప్పుల్లో ముంచేస్తుంది కాబట్టి తల్లిదండ్రులు చేయవలసింది ఏమిటి అంటే తమ పిల్లలు ఇతరుల పిల్లల కంటే కూడికల్లో ప్రత్యేకంగా కనబడుట కంటే సాధారణమైన వస్త్రమలను ధరింపనీయుడి. శుభ్రమైన, సులువైన మంచి వస్త్రములను ధరింపనీయుడి. మనము ధరించే వస్త్రములు కంటే మనమే ప్రాముఖ్యమైన వ్యక్తులము అని గ్రహింపజేయనీయుడి అని రాశారు. 

 

దీనిని చదువుతున్నవారలారా మీ యొక్క ఘనతను దేనిలో వెతుకుతున్నారు? మీయొక్క మంచి గుణములలో ఇతరుల యొక్క దృష్టిలో హెచ్చింపబడి ఉన్నారా లేదా మీ బట్టలతోనూ మీ ఆస్తులతోనూ పెద్దవాళ్లుగా కనబడాలి అని ఆశిస్తున్నారా? మంచి గుణాతిశయములు అంటే ఎప్పుడు కూడా మీ ఘనత క్రిందకి వెళ్లదు లేనియెడల మీ ఘనత పరితాపకరమైన పరిస్థితే. పై రూపమునకు మనము ఘనతనిచ్చినప్పుడు సదుపాయాలు తక్కువైనప్పుడు మనం నిరుత్సాహపడిపోతున్నాం. మీ ఘనతను ఎక్కడ వెతుకుతున్నారు? 

- బ్రదర్. జె. సంతోష్ గారు

 

ప్రార్థన అంశం:-

మన ఫీల్డ్ అన్నింట్లో కూడా 24 గంటలు గొలుసు ప్రార్థనలు జరిగేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş