Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.08.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 23-Aug-2023

దిన ధ్యానము(Telugu) 23.08.2023

 

అంశం: జయము పొందుకున్న వేళ

 

"నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము" - కీర్తనలు 143:8

 

అది ఒక ఉదయకాలం చీకటిగా ఉంది. ఆ సమయం ప్రభువుతో ఐక్య పడుటకు చాలా అద్భుతమైన సమయం. మనుషులు మనలను చూడడానికంటే ముందు దేవుని ప్రసన్నతను వెతికి ఆ దినమునకు కావలసిన అన్నింటనీ పొందుటకు దేవుని యొక్క కృపను పొందే ఆ సమయమే జయము పొందుకొనే సమయం. నిజముగా ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఇది ఉండిన యెడల కచ్చితంగా వాడు లోకాన్ని జయిస్తాడు. 

 

మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఉదయమున లేచి తండ్రి సముఖమునకు వెళ్లారు. ఆయన చిత్తాన్ని, ప్రణాళికను గ్రహించుకొని దాని ప్రకారము అద్భుత, ఆశ్చర్య కార్యాలు చేసి సాతాన్ని సులువుగా జయించారు. మరియు లేఖనములలో అనేక మంది పరిశుద్ధులు శత్రువులను జయించుటకు, దేశాన్ని సొంతం చేసుకొనుటకు ఉదయం లేచి వెళ్లిన దానిని చదువుతున్నాం. 

 

ప్రాముఖ్యంగా యెహోషువపాతు అనే రాజుకు వ్యతిరేకంగా యుద్ధం చేయుటకు వచ్చిన రాజులను ఆయన చూసినప్పుడు మిక్కిలి కలత చెందాడు. అయినప్పటికిని రాజును ప్రజలను తమ రెండు చేతులను దేవుని వైపు ఎత్తి తమ్మును తాము తగ్గించుకుని విజ్ఞాపన ప్రార్థన చేయడం ప్రారంభించారు. అందుకు దేవుడు చెప్పిన మాట భయపడకుడి ఈ యుద్ధము నాది మీది కాదు. జరిగినది ఏమిటి? వారు శత్రువులను పతనము చేయడానికి ఉదయమునే లేచారు. దేవున్ని స్తుతించి పాడే పాటల గుంపులు యుద్ధ సైన్యమునకు ముందు నడిచారు. స్తుతి ప్రారంభించిన వెంటనే శత్రువులు తమను తాము చంపుకుని హతమయ్యారు. ఆహా ఎంత పెద్ద విజయము! 

 

ప్రియమైన వారలారా! శత్రువైన సాతాను మిమ్మల్ని భయపెడుతూ ఉన్నాడా? మిమ్మలను నాశనం చేస్తాను అని సవాల్ విసిరుతూ ఉన్నాడా? లేదా మనుషులు మీకు వ్యతిరేకంగా లేచి ఉన్నారా? కలత చెందకుడి దేవుడు మనకు తోడుగా ఉండినప్పుడు మనకు కలత ఎందుకు? యుద్ధం యెహోవాది కాదా? మనము చేయవలసింది అంతా ఉదయాన్నే లేచి దేవుని యొక్క సన్నిధిలో వచ్చి నిలబడుట. అవును ఉదయ కాలపు ప్రార్థన ప్రాముఖ్యమైనది. అధికమైన చీకటి అధికమైన మహిమలను నడిపిస్తుంది. ఉదయాన్నే ప్రార్థన విజయాన్ని తీసుకొస్తుంది. ఉదయాన్నే వేచి ఉండే అనుభవాన్ని అలవాటు చేసుకొని జయం పొందుకునే సైనికులు వలె జీవిద్దాం. 

- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న వంట పనుల్లో పనిచేస్తున్న సేవకుల కొరఘ వారి కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort