Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.08.2023
Share:

By Village Missionary Movement

Saturday, 26-Aug-2023

దిన ధ్యానము(Telugu) 26.08.2023

 

అంశం: షూనేమీయురాలు

 

"ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును" - మత్తయి 10:41

 

షూనేము ఇది ఆ స్త్రీ యొక్క పేరు కాదు ఆమె నివసిస్తున్న ఊరు యొక్క పేరు. ప్రవక్త అయిన ఎలిషా ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆయనను తన ఇంటికి వచ్చి భోజనం చేయమని బ్రతిమలాడి వేడుకొన్నది. అలాగే ఆయన ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడల్లా ఆయనకు పరిచర్య చేస్తూ వచ్చేది. అది మాత్రమే కాదు ఆయన బస చేయుటకు ఆయనకు కావలసిన సదుపాయము చేస్తూ ఆయనకు ఒక గది కట్టి ఆయనకు అవసరమైనవి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆమె చూపిన ప్రేమకు ఆమె చేసిన పరిచర్యకు ఎలిషాకు ఆమె కొరకు ఏదైనా చేయాలి అనే తలంపును పుట్టించింది. అందుకు అతడు నీవు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడిగాడు. అందుకు ఆమె వారికి పిల్లలు లేరు అనే లోపాన్ని వ్యక్తపరచకుండా నేను నా ప్రజల మధ్యలో సుఖవంతంగా జీవిస్తున్నాను అని చెప్పింది. ఆమె ఎలాంటి ప్రతిఫలము ఎదురు చూడకుండా ఉపచరణ చేసిందో మనం గ్రహించవచ్చు. 

 

గెహజి ద్వారా కార్యాన్ని గ్రహించిన ప్రవక్త ఆమెను దివించినప్పుడు ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ కుమారుడు ఎదుగుతూ అనారోగ్యం వల్ల మరణించాడు. అది ఆమె హృదయాన్ని కలవరపరిచినను బెదిరిపోకుండా తన భర్తకు కూడా చెప్పకుండా ఎలీషా బస చేసిన ఆ గదిలో పరుండబెట్టి కర్మేరులో గల ప్రవక్త అయినా ఎలీషా యొద్దకు వెళ్లి ఆయన యొక్క కాళ్ళను పట్టుకొని తన యొక్క పరిస్థితిని వివరించింది. ఆయన తన పని వాడిని పంపుతాను అని చెప్పినప్పుడు లేదు మీరే రావాలి అని పట్టుదలతో నిలబడింది. ఆమె విశ్వసించినట్లు మరల తన కుమారుడిని పొందుకున్నది. బైబిల్ లో పేరు చెప్పబడని స్త్రీగా ప్రసంగికుల చేత ఎక్కువగా ప్రసంగింపబడని స్త్రీగా ఈమె కనబడినప్పటికీ ఉపచారము చేయుటలోనూ, దేవుని పిల్లలను ఘనపరచుటలోనూ, దృఢమైన విశ్వాసము కలిగి ఉండుటలోనూ ఈమె మనకు మంచి ఉదాహరణగా ఉంటుంది. 

 

ప్రియమైన వారలారా! ఒకవేళ మనకు పరిచర్య చేసే అవకాశం లేకుండా ఉండవచ్చు కానీ మనము షూనేమీయురాలు వలె మన ఇంటికి వస్తున్న దేవుని సేవకులను ప్రేమతో మన గృహాల్లో చేర్చుకొని వాళ్లకు ఉపచారం చేయవచ్చు కదా. ప్రవక్త అనే నామం పేరట ప్రవక్తకు మనము చేసిన కార్యాలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తాము అని వాక్యము చెబుతూ ఉంది. అవును షూనేమీయురాలు వలె ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా మేలు చేసినప్పుడు దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని కచ్చితంగా మనకు దయ చేస్తాడు అనే దాంట్లో ఎంత మాత్రమూ సందేహం లేదు. 

- శ్రీమతి. అనిత అలగరా సామి గారు 

 

ప్రార్థన అంశం:

తమిళనాడులో గల 310 జిల్లాల్లో దెబోరా గుంపులు ఏర్పరచబడినట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort