Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.08.2023
Share:

By Village Missionary Movement

Sunday, 27-Aug-2023

దిన ధ్యానము(Telugu) 28.08.2023

 

అంశం: ఐక్యత

 

"అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును" - 1 యోహాను 1:7

 

9 మంది గల గుంపు ఒకటి కొండపై శిఖరమునకు వెళ్లి వచ్చుటకు ప్రణాళిక సిద్ధము చేసుకున్నారు. అత్యధిక ప్రయాస మధ్యలో విజయవంతముగా శిఖరమును తాకి వాళ్లు తిరిగి వచ్చారు. వారిని చూచిన అందరికీ ఆశ్చర్య వేసింది. ఎందుకంటే ఆ 9 మందిలో నలుగురికి కళ్ళు కనబడవు, ఇద్దరు మాట్లాడలేరు వారికి వినబడదు, ముగ్గురికి రెడీమేడ్ కాళ్లు అమర్చబడి ఉన్నాయి. అందుకే ప్రజలు ఆశ్చర్యపడడానికి గల కారణం. మరి అలా అయితే ఎలా సాధించగలిగారు? ఐక్యత కలిసికట్టుగా వారు చేసిన ప్రయాసే. సాధారణంగా ఇతరుల గురించిన దయగలవారు చాలా తక్కువ మందే. మనలో అనేకమంది ఇతరులతో ఐక్యత కలిగి ఉండుటలో జంకుతున్నాం అందుకు గల కారణములు అనేకముగా ఉన్నప్పటికీ ప్రాముఖ్యమైన కొన్ని చూద్దాం. 

 

1. నేను ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి? నేనే వెళ్లి వాళ్ళతో మాట్లాడితే నా పరువు ఏమవుతుంది? అని ఆలోచన మనము ఇతరులతో మాట్లాడుటకు ఆటంకంగా ఉంటుంది. ఆలాగే దేవుడు మన గురించి ఆలోచిస్తే మన పరిస్థితి ఏమవుతుంది కొద్దిగా ఆలోచిద్దాం. 

 

2. ఇతరుల సహాయము నాకు అవసరం లేదు అనే ఆలోచన. ఇది కూడా కష్టమే. ఒకసారి ఈ విధంగా ఆలోచిద్దాం మనం మాత్రమే ఈ లోకంలో ఉన్నాం మన దగ్గర చాలా డబ్బు ఉన్నప్పటికీ మనము జీవించగలమా? నీరు, పాలు, న్యూస్ పేపర్, పెట్రోలు ఆహారము వీటన్నిటినీ పొందుకొనుటకు ఇతరులకు సహాయం అవసరము. కాదు ఒకవేళ ఇతర సహాయం మనకు అవసరం లేదు అనే పరిస్థితిలో మనం ఉండినప్పటికీ మన సహాయము ఇతరులకు అవసరమై ఉండవచ్చు. మనుషులను తిరస్కరించుట సృష్టించిన దేవున్ని తిరస్కరించినట్లు అవుతుంది. 

 

ప్రియమైన వారలారా! మన గుమ్మంలో ఉంటున్న అనేకమైన అన్యులను మనం ప్రేమిద్దాం. మాట్లాడుతున్న మాటలను గమనిస్తూ చిరునవ్వుతో ఇతరులతో ఉన్న దూరాన్ని తగ్గించుకుందాం. దేవుని ప్రేమను పంచుదాం, క్షమిద్దాం, అందర్నీ ఆదుకుందాం. అనేకులను నిత్య జీవమునకు తీసుకువెళ్దాం. మీరు మాట్లాడితే వినుటకు ప్రేమ చూపించుటకు ప్రజల సిద్ధముగా ఉన్నారు, ప్రేమ చూపించుటకు ఐక్య పడుటకు మీరు సిద్ధమేనా? ఈ దినము అవకాశము మరోకసారి మీకు దొరకకపోవచ్చు. ప్రయాస పడదాం త్వరగా పని చేద్దాం అవకాశం సద్వినియోగపరుచుకుందాం. 

- బ్రదర్. ఎల్. అలాగర సామి గారు

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో జరుగుతున్న రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ కొరకు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban holiganbet setrabet marsbahis giriş vaycasino giriş