Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.09.2023
Share:

By Village Missionary Movement

Thursday, 28-Sep-2023

దిన ధ్యానము(Telugu) 28.09.2023

 

అంశం: అవసరమైనది

 

"మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొ నెను, అది ఆమె

యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను" - లూకా 10:42

 

ఫ్రాన్సిస్ సేవిర్ అనే మిషనరీ గోవా అనే ప్రాంతమునకు 1542వ సంవత్సరంలో వచ్చి దిగారు. వచ్చి చేరుకున్న వెంటనే మొట్టమొదటిగా అక్కడ మాట్లాడుతున్న భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. చెరసాలలోను, హాస్పిటల్స్ కు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకు యేసు క్రీస్తు ప్రేమను ప్రకటించుట అవసరము అని గ్రహించిన వారిగా వాళ్ల మధ్యలో దేవుని యొక్క వాక్యమనే విత్తనాన్ని విత్తడం ప్రారంభించారు. వారి యొక్క హృదయాల్లో విత్తబడినటువంటి వాక్యము ఫలితం ఇచ్చింది. అనేకులు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. మరియు వీధుల గుండా వెళ్లేటప్పుడు ఒక గంట మోగిస్తూ చిన్నారులను బడికి రమ్మని ఆహ్వానిస్తూ ఉండేవారు. అక్కడకు వచ్చే వారందరికీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ అవసరము అని గుర్తించారు. వాళ్లకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను నేర్పించారు. సమాజంలో అవసరములో ఉన్న ప్రజలకు అనేకమైన సహాయమును చేశారు. అవసరమైన ప్రజలకు తాను సంపూర్ణముగా సమర్పించుకున్న వాడిగా ఉన్నందున విదేశములు నుండి వచ్చే అన్య దేశస్థులకు పునర్జీవం కలిగించుట, శాంతి లేని స్థలములలో సమాధానాన్ని తీసుకుని వచ్చుట ఈయన పనిగా ఉండేది. 

 

బైబిల్లో కూడా 1 సమూయేలు 1వ అధ్యాయంలో హన్నాను మనము ఎరుగుదము. ఈ హన్నా యొక్క పరిస్థితి మరియు అవసరత గురించి మనం చదువుతున్నాం. అదే సమయంలో దేవునికి కూడా ఒక అవసరము ఉండేది. ఈ హన్నా తన అవసరము నిమిత్తము దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ తన హృదయాన్ని బయలుపరచుట అనేది 1 సమూయేలు 1:15 లో హన్న యొక్క ప్రార్థన కొరకు చదువుతున్నాం. ఆమె గర్భవతి అయి దేవుని యొద్ద ఒక కుమారుడిని అడిగాను అని చెప్పి ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టింది( 1సమూయేలు1:20) ఈ సమూయేలే తరువాత దినాలలో గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. 

 

ప్రియమైన వారలారా హన్న యొక్క కన్నీటి ప్రార్థన వలన హన్న యొక్క అవసరత దేవుని యొక్క అవసరత నెరవేర్చబడింది. యేసుప్రభు యొక్క బిడ్డలుగా ఉంటున్నా మన ప్రతి ఒక్కరము ప్రతి దినము మనకు అవసరమైన దేవుని యొక్క కృప కొరకు మన వంతు మనము ఆయనను అడుగుదాం. మరియు ఈ లోకంలో అనేకమైన సమస్యలు, కన్నీరు, దుఃఖము అనే వాటి నుండి నన్ను విడిపించుటకు ఎవరూ లేరా అనే అంగుళార్పుతోను నిట్టూర్పు తోను జీవిస్తున్న అనేకులకు యేసు అవసరము. ఎవరు నా నిమిత్తము వెళ్లుదురు అనే అవసరముతో పిలుస్తున్న దేవుని స్వరమునకు మీరు నేను జవాబుగా ఉన్నాం. ఆలోచిద్దాం, ప్రయాస పడదాం. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

గుజరాత్ రాష్ట్రంలో పరిచర్యలు విస్తరింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort