Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.09.2023
Share:

By Village Missionary Movement

Saturday, 30-Sep-2023

దిన ధ్యానము(Telugu) 30.09.2023

 

అంశం: నన్ను మార్చుము

 

"పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము" - 2 తిమోతికి 3:5

 

ఒక రాత్రి సమయంలో తన భార్య మరియు చెవులు వినబడని తల్లితో వాహనంలో ప్రయాణం చేస్తున్నారు ఒకాయన. ఆయన నడుపుతున్న వాహనం వెనుక ట్రాన్స్పోర్ట్ పోలీసు వారు అనేక కిలోమీటర్ల దూరం నుండి ఆయన వెంబడిస్తూ వస్తున్నారు. 

 

ఒక సమయంలో వీరు నడుపుతున్న వాహనమును పోలీసు వారు తమ వాహనముతో ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చి వారి వాహనాన్ని నిలబెట్టారు భయముతో తన వాహనాన్ని ఆపి నిలబెట్టిన ఆ వ్యక్తితో పోలీస్ అధికారి షేక్ హ్యాండ్ ఇచ్చారు. తరువాత అధికారి చెప్పిన మాటలు ఈయనకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. 

 

అధికారులు చెప్పినది ఇదే చాలా దూరం నుండి మీ వాహనమును వెంబడిస్తూ వస్తున్నాం మీరు వాహనం నడుపుతున్నప్పుడు వాహనం నడిపే నియమాలను చక్కగా పాటిస్తూ బండిని నడుపుతున్నారు. ఈరోజు రోడ్డు సంరక్షణ దినం కాబట్టి మీ వలె రహదారి నియమాలను పాటించే వారికి పదివేల రూపాయలు బహుమానముగా ఇస్తున్నాం. ఇదిగో ఈ చెక్కును తీసుకోనండి అన్నారు. ఆ చెక్కును సంతోషంగా తీసుకున్న ఆయన చెప్పిన మాటలు విన్న అధికారులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ డబ్బును నాకు ఇచ్చారు సంతోషం.ఈ డబ్బుతో నేను నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాను అన్నాడు. 

 

అప్పుడే నిద్ర నుండి లేచిన ఆయన భార్య వాహనము ఆగి ఉండుట పోలీసులు తన భర్తతో మాట్లాడుట చూచి ఆమె తొందరపడి సార్ నేను చాలాసార్లు మద్యం సేవించి వాహనం నడపకూడదు అని చెప్పాను కానీ ఆయన నా మాట వినలేదు అని ఆ పోలీసులతో చెప్పారు. ఈ మాటలు ఏమీ అర్థం కానీ చెవులు వినబడని ఆయన యొక్క తల్లి గారు ఇలా చెప్పారు. నేను ఎన్నోసార్లు చెప్పాను దొంగ బండిని నడపవద్దు అని నా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు దొరికిపోయాడు అని చెప్పారు. ఆమె చెప్పిన దానిని విన్న పోలీసు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా ఇలాగే అనేకులు బయటకు ఆత్మీయుల వలె కనబడుతున్నారు కానీ దగ్గరికి వెళ్లి చూస్తే సాక్ష్యము లేని జీవితం. మనకు చాలా దుఃఖము కలిగిస్తుంది. ఇలాంటి జీవితం జీవించే వారిని చూసి సున్నం వేసిన సమాధులు వలె ఉన్నారు అని యేసుక్రీస్తు గద్దిస్తూ ఉన్నారు. వారు బయటకు అలంకరణముతో కనబడిన లోపల సకల విధములైన అపవిత్రతలతో నిండి ఉన్నారు. మన జీవితం ఇలా ఉంటుందా అని ఆలోచిద్దాం. దేవుని భక్తి అనే వేషధారణ వస్త్రమును నేను ధరించుకొని ఉన్నానా లేదా మాయలేని యదార్ధమైన జీవితమును జీవిస్తున్నానా అని ఆలోచించి సరి చేసుకుందాం. 

- బ్రదర్. కామరాజు గారు. 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనుల యొక్క అవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet