Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.10.2023
Share:

By Village Missionary Movement

Monday, 02-Oct-2023

దిన ధ్యానము(Telugu) 02.10.2023

 

అంశం: ఉప్పుగా, వెలుగుగా

 

"మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు" - మత్తయి 5:13

 

కొండమీద ప్రసంగం అన్నది 113 వాక్యాలతో కూడిన మూడు అధ్యాయాలు గల భాగము. కొండమీద ప్రసంగం ద్వారా యేసుక్రీస్తునీ అనేకమంది అంగీకరించారు. ఈ దినము మన దేశ పితాగా పిలవబడిన మహాత్మా గాంధీ యొక్క పుట్టినరోజు. ప్రభువైన యేసుక్రీస్తు కొండమీద ప్రసంగంలో చెప్పిన సందేశముకు గాంధీజీ చాలా ఆకర్షించబడ్డారు. 

 

పరిశుద్ధమైన బైబిల్ ను మిక్కిలి ప్రేమించుటకు దాన్ని చదువుటకు గాంధీ ఇష్టముగా ఉండేవారు కానీ గాంధీజీ రక్షింపబడుటకు మారుమనసు పొందుటకు ఆయనకి ఇష్టం లేదు. దానిని చూచిన ఆయన స్నేహితుడు మరియు భారతదేశంలో పరిచర్య చేసిన సీనియర్ మిషనరీ అయినా డాక్టర్ స్టాన్లీ జోన్స్ గాంధీజీని ఇలా అడిగారు. మీరు ఎందుకు యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు అనే ప్రశ్న వేశారు. 

 

దానికి గాంధీజీ నేను యేసుని తిరస్కరించలేదు యేసుని చాలా ప్రేమిస్తున్నాను కానీ ఆయనను వెంబడించే క్రైస్తవులు ఉపదేశ ప్రకారము జీవించలేదు కాబట్టి నేను ఎందుకు క్రైస్తవ్యాన్ని అంగీకరించాలి అని జవాబు ఇచ్చారు. మరియు తనకి ఇంగ్లాండ్లో దక్షిణాఫ్రికాలో క్రైస్తవుల ద్వారా జరిగిన ఛైదైన అనుభవాలను స్టాన్లీ జోన్స్ పంచుకున్నారు. యేసు మంచివారే కానీ ఆయన వెంబడించిన వారు ఆయన చెప్పినట్లు నడుచుకోలేదు అని జవాబు ఇచ్చారు. 

 

మత్తయి సువార్త 5 అధ్యాయంలో 13-14 వచనాల్లో మనము ఇలా చదువుతున్నాం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు మరియు మీరు లోకమునకు వెలుగై యున్నారు అని చదువుతున్నాం. ఉప్పుగా, వెలుగుగా సాక్షి కరమైన జీవితమును జీవించలేని క్రైస్తవుల యొక్క తప్పిదమైన నడవడికలు చేత అనేకులు యేసుక్రీస్తును విడిచి దూరంగా వెళ్లిపోతున్నారు. దాంట్లో ఈ దినము చదివిన గాంధీజీ ఒకరు. 

 

ఈ సందేశాన్ని చదువుతున్న ప్రియమైన క్రైస్తవులారా మన ప్రతి ఒక్కరి నడవడికను ఇతరులను క్రీస్తు వద్దకు నడిచే విధముగా లేదా వాళ్లను క్రీస్తు నుండి దూరం చేసేటట్లు మన నడవడికలు ఉన్నాయి కాబట్టి మన ప్రతి ఒక్కరము వాక్యాన్ని వినే వారు మాత్రమే కాకుండా దాని ప్రకారమే చేసేవారుగా ఉందాం. అట్టి కృపను దేవుడు మనకు చూపించిన గాక!  

- బ్రదర్ జాకబ్ శంకర్ గారు

 

ప్రార్థన అంశం

ఈ నెల అంతా జరిగే పరిచర్యలో దేవుని హస్తము తోడేయండి నడిపించినట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet instagram unban service tiktok unban instagram unban x unban twitter unban palacebet