Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.10.2023
Share:

By Village Missionary Movement

Thursday, 26-Oct-2023

దిన ధ్యానము(Telugu) 26.10.2023

 

అంశం: సోలిపోకుము

 

"శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు" - సామెతలు 24:10

 

రాము యొక్క చెక్కల దుకాణంలో ఎలుక ఒకటి దూరి అక్కడ ఉన్న చెక్కలన్నీ కూడా కొరికి పాడు చేసింది. తర్వాత దాని యొక్క బాధ భరించలేక ఆ ఎలుకను చంపాలి అని అక్కడక్కడ ఎలుకలు పట్టే బోన్లు పెట్టాడు రాము. ఎలుకలు ప్రాణముతో పట్టబడి ఉండటం చూసి చాలా సంతోషించాడు. తర్వాత ఎలుకలను చంపేశాడు. కానీ రాముకు ఒక విషయంలో ఆశ్చర్యం అనిపించింది. తన దుకాణంలో గల చెక్కలన్నీ కూడా కొరకగలిగిన ఈ ఎలుక ఎలుక పట్టే బోనును కొరికి బయటకు రావచ్చు కదా ఎందుకు రాలేదు అని ఆలోచించాడు.

 

మన జీవితంలో కూడా ఒక ఇరుకు వచ్చిన వెంటనే ఆ ఇరుకు మాత్రమే మన కనుల ముందు కనబడుతూ ఎవరు నన్ను విడిపిస్తారు అని దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ విడిపించే వ్యక్తిని విడిచిపెట్టి మనుషుల వైపు చూచుట వలన నిరుత్సాహపడి మన బలాన్ని కోల్పోతున్నాం. ముదిమి వచ్చేవరకు నిన్ను ఎత్తుకుంటాను నిన్ను కాపాడుతాను అని యెషయ 46:4లో దేవుడు చెబుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మాట తప్పనివాడు మరియు నేను నిన్ను విడిపిస్తాను నీవు భయపడుతున్న మనుషులు చేతిలో ఉండి నిన్ను కాపాడుతాను అని యిర్మియా 39:17 లో చెబుతున్నారు. మీ యొక్క ఇరుకులో నుండి చింతల నుండి కష్టముల నుండి ఆయన విడిపించుటకు ఆయన దగ్గర మార్గము కలదు దానిని గ్రహించి ఇరుకులో, చింతలో దేవుని నమ్మి ఆయనను అడిగితే చాలు ఆయన మిమ్మల్ని నడవవలసిన మార్గంలో నడిపిస్తారు. అలాగుననే మోషే, యెహోషువ వేలకోలది మంది ప్రజలను నడిపించారు. ఒకసారి వాళ్ళ ముందు ఎర్ర సముద్రం మరొకసారి ఫరో సైన్యం వచ్చి వారిని చాలా ఇరుకును పెట్టింది. అయితే మోషే దేవుని వైపు చూశాడు. దేవుడు అతని కొరకు సులువైన మార్గాన్ని చూపించాడు. నీ చేతి కర్రను చాపము అన్నాడు చాపిన వెంటనే ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడింది. అంతే ఐగుప్తు ప్రజల యొక్క రధములు అన్నీ కూడా అందులో ముంచి వేశాడు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన స్నేహితులారా మీ జీవితంలో ఇరుకులు, కష్టాలు ఎక్కడ అడుగు పెట్టాలో తెలియని పరిస్థితిలో ఉన్నారా? సులువైన మార్గంలో నడుచుటకు దేవుని పైన ఆనుకోండి. ఈ లోకంలో మీకు ఉపద్రవం కలవు నేను లోకాన్ని జయించాను అని దేవుడు చెప్పి ఉన్నారు కాబట్టి ఆయనను పట్టుకోండి అప్పుడు మీరు కూడా జయించగలరు. 

- శ్రీమతి. అనుభూ జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:

మన దగ్గర సంపూర్ణ బైబిల్ పొందుకున్న ప్రతి ఒక్కరు ఇంకా ఆత్మలో ఎదిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet ibizabet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş holiganbet giriş çarkbet çarkbet giriş