Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.11.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 31-Oct-2023

దిన ధ్యానము(Telugu) 01.11.2023

 

అంశం: వాట్ నెక్స్ట్

 

"కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరు గునో యెవరు తెలియజేతురు?" - ప్రసంగి 10:14

 

మన పిల్లలను ఇంటర్ అయిపోయిన వెంటనే వాట్ నెక్స్ట్ అని అడుగుతాం. యవనస్తులు ప్రతిదినమ

తర్వాత ఏమిటి అని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఈ ప్రశ్న నిరుత్సాహపడి ఉండేటప్పుడు, చింతతో, అపజయముతో కూర్చుని ఉండేటప్పుడు వ్యక్తిగతముగా తన్ను తాను కొందరు అడగడం లేదు. 

 

చక్కగా విజయవంతంగా పౌరుషము కలిగి మనసు కోరుకునేటట్లు వెళుతూ ఉన్న కొత్త నిబంధనలో సౌలు జీవితంలో ఒక పడిపోయే పరిస్థితి. తాను ముందుకు వెళ్ళలేదు గుర్రం నుండి కింద పడిపోయాడు మధ్యాహ్నము వెలుగులో ఒక స్వరమును విని భయపడి వణుకుతూ ఉన్నాడు. కానీ ఆయన దానితో అన్ని అయిపోయాయి అని క్షమాపణ అడిగి ముగించకుండా వాట్ నెక్స్ట్ అని ఆలోచించి నేను ఏమి చేయడానికి మీరు చిత్తగించి ఉన్నారు అని అడుగుతున్నారు. దీనిని ఎదురుచూచిన దేవుడు ఆయనకు తాను కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను వ్యక్తపరుస్తున్నారు. 

 

 సౌలు పౌలుగా మారి తన మార్గాన్ని మార్చుకున్నాడు. దేవునితో ఉండి పరిచర్యలో ముందుకు నడుస్తున్నాడు. నన్ను వెంబడించుడి అనే ధైర్యంతో పౌలు చెప్పేటట్లు ఇంకా అనేకులు ఆయనను వెంబడించే మాదిరి కరమైన జీవితం జీవించుటకు దేవుడు సహాయం చేశారు. ఇంకనూ నీవు చెడు మార్గంలో వెళుతున్నావా లేదా పాపపు ఊబిలో పడిపోయి ఉన్నావా ఇక జీవించడమే నాకు కష్టము అని నరక జీవితమే నాకు ఉన్నట్లుంది అని అనుకుంటున్నావా లేదు దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఈ ధ్యానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నారు. నీవు పాపములో పడిపోయినది నిజమే కానీ దీనిని చదివిన తర్వాత అదే దారిలో వెళ్లకుండా నీ మార్గము మార్చుకొని వాట్ నెక్స్ట్ అని ఆలోచించి దేవుని చిత్తాన్ని చేయుటకు సమర్పించుకుంటున్నాను అని దేవుని ఎదుట సమర్పించుకొని దేవుని హస్తమును పట్టుకొనుము అప్పుడు పడిపోయిన నీవు కచ్చితంగా లేస్తావు. సంసోను మార్గము తప్పిపోయి అనేకమంది చేత హేళన చేయబడ్డాడు కానీ అలా మరణించుటకు ఇష్టము లేక వాట్ నెక్స్ట్ అని ఆలోచించి దేవుని యొద్ద అవకాశము అడిగాడు. ఆయన మరణించేటప్పుడు ఆయన చంపిన వాళ్ళు అనేకులు. దావీదు పాపములో పడ్డాడు అయినప్పటికీ దూళిని దులిపి లేచి నిలబడి తన పరుగును జయముగా ముగించారు. 

 

 యవ్వనుడా నీవు కూడా పడిపోయి ఉంటే కలవరపడకుము అందరి జీవితంలో పడుట అనేది ఉంటుంది. లెమ్ము, లేచుటకు బలము నీకు ఉన్నది కాబట్టి లేచుటకు ప్రయాసపడు, ఆశించు, ప్రయత్నించు బలము తనంతట తానే వస్తుంది వాట్ నెక్స్ట్ అని ఇతరులతో అడగకము నిరుత్సాహ పడిపోయిన ఆత్మను అడుగు. దేవుని చిత్తమునకు సమర్పించుకొనుము, ఆయన హస్తమును పట్టుకొనుము నిన్ను కూడా దేవుడు గొప్పగా అనేకులకు గొప్ప ప్రయోజనకరముగా దేవుడు మారుస్తారు. ఆమెన్! 

- బ్రదర్. కే. డేవిడ్ గణేష్ గారు 

 

ప్రార్థన అంశం:

ఈ నెల అంతా జరగబోయే పరిచర్యలో దేవుని హస్తము తోడైయుండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betasus casibom maximcasino pashagaming maximcasino instagram ban service onlyfans agency matbet