By Village Missionary Movement
Friday, 03-Nov-2023దిన ధ్యానము(Telugu) 03.11.2023
అంశం: నమ్మి ఇవ్వబడిన బాధ్యత
"మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును" - మత్తయి 16:27
విచిత్రమైన పురాతన కథ ఒకటి కలదు. దేవుడు ఈ లోకమును సృష్టించినప్పుడు సమస్త సృష్టిని పరామర్శించుటకు కొంతమంది దూతలను నియమించారు. మనుషులకు, సముద్ర జీవరాశులకు అడవిలో ఉన్న జీవరాశులకు చెట్లకు పచ్చ గడ్డి అని ఒక్కొక్క దూతను నియమించారు. గడ్డికి నియమించబడిన దూత ఈ చిన్న గడ్డిని నేను చూడాలా అని ఆలోచించి దానిని పరామర్శించకుండా విడిచిపెట్టింది. పచ్చికగల గడ్డి ఎండిపోయింది. గడ్డి లేకుండా ఆవులు, మేకలు అడవుల్లో జీవించే జింకలు ఆకలితో అలమటించాయి. దేవుడు ఆ దూత వద్ద నీకు ఇవ్వబడిన పని చిన్నది అని తలచి అశ్రద్ధ చేశావు ఇప్పుడు నీ పని యొక్క మేలు తెలిసిందా అని అడిగారు.
ఇలాగే ఈ దినము అనేకులు తమకు ఇవ్వబడిన పని చిన్నది పెద్దది అల్పమైనది శ్రేష్టమైనది అని తలంచి అశ్రద్ధ చేస్తున్నారు. ఒకటి ప్రాముఖ్యమైన పని మరి ఒకటి ప్రాముఖ్యత లేని పని అని తలంచూతు ఉన్నారు. మీకు ఈ బాధ్యత పని ఇచ్చినది మనుషులు కావచ్చు కానీ పని చేయుటకు అనేకులు ఉండేటప్పుడు మీకు ఇవ్వాలి అనే తలంపును దేవుడే ఆ మనుషుల హృదయంలో పుట్టించిన మీకు అప్పగించారు. దేవుని అనుమతి లేకుండా మీకు ఏమీ ఇవ్వబడదు. మిమ్మలను నమ్మి దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు ఎలా నెరవేరుస్తున్నారు. ఆయన నమ్మి ఇచ్చిన బాధ్యతను జాగ్రత్తగా నెరవేర్చి ముగించేటప్పుడు దానికి తగిన ఫలితం మనకు దొరుకుతుంది. 12 అరకల ఎడ్లు చేత దుక్కి దున్నుతున్న ఎలీషా మొదటి (1రాజుల 19: 19) అంత ధనము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయినప్పటికీ పరిచర్య చేయుటకు ఏలియా చేతులకు నీళ్లు పోసి సహాయం చేస్తున్నారు. ఏలియా చేతులకు నీళ్లు పోసే పనిని జాగ్రత్తగా చేస్తున్నాడు. తన పనిలో నైపుణ్యత గల వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుట నిలుచును (సామెతలు 22: 29) అని అంటున్నారు.
ప్రియమైన వారలారా! మీకు ఇవ్వబడిన బాధ్యత పని తర్వాత పరలోక ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే ఈ బాధ్యత పని మీకు పరలోక దేవుని చేత అనుగ్రహించబడి ఉంది అనేదాన్ని మర్చిపోకుడి. మీకు యజమానుడు క్రీస్తే లోకానుసారమైన కూలిని చూసి మనుషుల్ని చూసి పరలోక దీవెనలను కోల్పోకుడి. ఎక్కడ ఉండినా ఏమి చేసినా జాగ్రత్తగా చేసి పరలోక దీవెనలు పొందుకొనుడి. మీరు దీవెనలు వెతుకుటకు అవసరం లేదు అవి మిమ్మల్ని వెంబడిస్తాయి.
- శ్రీమతి. దవమని వైరల్ గారు
ప్రార్థన అంశం:
సువార్త క్యాంపుల కొరకు అవసరమైన ధన సహాయము అందేటట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250