By Village Missionary Movement
Saturday, 04-Nov-2023దిన ధ్యానము(Telugu) 05.11.2023 (Kids Special)
అంశం: కోరిక నెరవేరుతుంది
ప్రత్యేకముగా చిన్నపిల్లల కొరకు
"నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు" - ఆదికాండము 12:2
ప్రియమైన పిల్లలు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్నారా? మీరు ముందు పొందుకున్న మార్కులు కంటే ఇంకా ఎక్కువ మార్కులు మీరు పొందుకోవాలని ఆశ హృదయంలో ఉంటే యేసయ్య దాన్ని కచ్చితంగా నెరవేరుస్తారు. అందుకు మనం మూడు కార్యములు చేయాలి. ఒకటి ఆశించాలి రెండోది యేసయ్యకు ప్రార్థన చేయాలి మూడోది దేవునికి భయపడి ప్రియమైన వాళ్ళుగా నడుచుకోవాలి ఇలా చేస్తూ మనం చదవడం ప్రారంభిస్తే యేసయ్య మనకు అద్భుతమైన కార్యం చేస్తారు. సరే మనము ఒక కదా విందామా?
కొంచెం నైపుణ్యము కలిగిన శిల్పి ఒక ఆయన ఉండేవాడు. శిల్పి అంటే రాళ్లపైన బొమ్మలను చెక్కేవారు. ఆ శిల్పి దృష్టిలో రెండు బండ రాయిలు కనబడ్డాయి. వాటిని చూచిన వెంటనే వీటిలో రెండు శిల్పాలు చెక్కాలి అని ఆలోచించి కొందరి స్నేహితులైన శిల్పకార్లను పిలిచి ఈ రెండు బండరాయిల్లో లోకపు ప్రసిద్ధిగాంచిన, అందరూ ఆశించే ఇద్దరు మనుషులను చెక్కాలి కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం అన్నారు. కానీ వాళ్ళు అయితే అది చాలా చిన్న రాయి దీంట్లో లోక ప్రసిద్ధిగాంచిన మనుషులను చెక్కుట అసాధ్యము అని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఆయన తన హృదయములో ఒక తీర్మానం చేసుకుని దాని కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు కాబట్టి దానిని అంత త్వరగా విడిచి పెట్టుటకు ఇష్టపడలేదు. హఠాత్తుగా ఆయన మనసులో దేవుడు ఒక మంచి శిల్పకారుని గురించి ఆయనకు గుర్తు చేశారు. ఆయనను పిలిపించుకొని వచ్చి ఆయనకి రాళ్ళను చూపించి తన కోరికను చెప్పారు. ఆయన ప్రార్థన చేసి దేనిని చెక్కాలి అని ఆలోచించినప్పుడు అప్పుడు దావీదు సితార వాయిస్తూ దేవుని మహిమ పరుస్తున్నట్లు, ఒక రాయిని తీసి గొలియాతును పడగొట్టిన ఆ సంఘటన ఆయనకు గుర్తుకు వచ్చింది. దానిని అలాగే శిల్పముగా చెక్కారు. ఆయన అలా చెప్పినప్పుడు కొన్ని అవసరంలేని భాగములను చెక్కవలసి వచ్చింది. ఆయన అలా చెక్కేటప్పుడు మంచి విలువ కలిగిన శిల్పముగా అది మారింది. చూచుటకు అందరికీ నిజముగా దావీదు సితార వాయిస్తున్నట్లుగాను యుద్ధములో ఒకే రాయితో గోలియాతును పడగొట్టినట్లుగా కనిపించాయి.
సరే పిల్లలు దీంట్లో గమనించవలసిన కార్యమేమిటి అంటే దావీదు సాధారణమైన కాపరిగా ఉండినప్పటికీ ఆయన హృదయములో దేవుని మహిమ పరిచి దేవుని ఘనపరచాలని తలంపు కలిగినందున ఆయనను ఈ దినం వరకు మనము గుర్తించుకునే ఒక మాదిరి కరమైన దేవుని బిడ్డగా కనబడుతున్నాడు. మీరు కూడా మిమ్మల్ని సాధారణంగా ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని యేసయ్య చెక్కేటట్లు ఆయనకు మీ జీవితం అప్పగించినప్పుడు లోకం మిమల్ని చూచి ఆశ్చర్యపడే విధముగా ఆయన మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. మనం ప్రాణముతో ఉండేటప్పుడు మాత్రమే కాదు మరణించిన లోకం మనలను గుర్తించుకుంటూ ఉంటుంది. సరేనా!
- సిస్టర్. దేబోరాల్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250