Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.11.2023
Share:

By Village Missionary Movement

Sunday, 26-Nov-2023

దిన ధ్యానము(Telugu) 26.11.2023

 

అంశం:- గులాబీ పువ్వు

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను" - కీర్తనలు 13:6

 

హాయ్ పిల్లలు స్కూల్ కి క్రమంగా వెళుతూ వస్తున్నారా? మీ అందరికీ ఇంట్లో రకరకాల మొక్కలు వేసి తోట పెంచాలి అంటే చాలా ఇష్టం కదా? మీ వలే జెలీనాకు కూడా పువ్వులు అంటే చాలా ఇష్టం. తన గురించి ఈరోజు కదా విందామా? 

 

జెలీనా అనే పాపకు గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం అందువలన వాళ్ళమ్మ తనకు గులాబీ పువ్వు మొక్కలు కొనిచ్చారు. రంగురంగులు పువ్వులు పూస్తూ ఉంటే రోజు వాటిని తలలో పెట్టుకుని స్కూల్ కి వెళ్ళేది. తన స్నేహితురాలైనా జెస్సీ కి కూడా పువ్వులు ఇచ్చి వెళ్ళింది. జెలీనా యొక్క అమ్మగారే రోజు మొక్కలకు నీళ్లు వేస్తూ ఉంటారు అలానే వాటిని శుభ్రం చేస్తూ ఉంటారు. 

 

ఒకరోజు జెస్సి జెలీనాతో నువ్వు రోజు అందమైన పూలను తీసుకొస్తున్నావే నీకు ప్రతిరోజు పువ్వులు ఇస్తున్న గులాబీ మొక్కకు నువ్వు ఏమిస్తున్నావ్ అని అడిగింది. జెలీనాకు ఏమి చెప్పాలో తోచలేదు మొక్కకు అమ్మే రోజు నీళ్లు పోస్తున్నారు మరి నేను ఏమి చేయట్లేదే అని ఆలోచించింది. స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చి ఆ గులాబీ పువ్వులకు నీళ్లు పోయడం ప్రారంభించింది జెలీనా. దానిని చూసిన అమ్మకు చాలా సంతోషం అనిపించింది. నాకు రోజు పూలిస్తున్న మొక్కకు నేను ఏదైనా చేయాలి కదా అమ్మ అని అన్నది. అవును జెలీనా నువ్వు చెబుతున్నది నిజమే అలాగే యేసయ్య కూడా మనకు ఎన్నో మేలులు చేసి ఉన్నారు మరి మనం ఆయనకి ఏదైనా చేయాలి కదా కాబట్టి మన వీధిలో ఉన్న పిల్లలకు సండే స్కూల్ చెబుదాము అని అమ్మ చెప్పిన వెంటనే జెలీనా చాలా సంతోషముతో గంతులు వేయడం ప్రారంభించింది. 

 

మన ఆమెన్ విలేజ్ టీవీలో కూడా చిల్డ్రన్ ప్రోగ్రాం చాలా జక్కగా జరుగుతుంది దాన్ని చూసి నేర్చుకుందాం అని అమ్మ టీవీ ఆన్ చేశారు. యేసు యొక్క సంతతి అనే కార్యక్రమం వచ్చిన వెంటనే దానిని చూచి గంటసేపు అనేక కార్యక్రమాలు నేర్చుకున్నారు. 

 

సరే మరి మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య కొరకు ఏదైనా చేయాలి కదా అని జెలీనా మనకు గుర్తు చేస్తుంది. ఏంటి పిల్లలు మీరు కూడా యేసయ్యకు ఏదైనా చేయడానికి సిద్ధపడుతన్నారా? సూపర్

- శ్రీమతి. బ్యులా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş