Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.11.2023
Share:

By Village Missionary Movement

Sunday, 26-Nov-2023

దిన ధ్యానము(Telugu) 27.11.2023

 

అంశం:- భయపడకుము

 

"నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును" - యెషయా 41:10 

 

యవ్వనస్తుడు ఒకడికి ఎలాంటి రోగం లేనప్పటికీ తనకి ఎప్పుడూ గుండె నొప్పి వచ్చేటట్లు ఉండేది. త్వరగా మరణిస్తానేమో అని భయం కూడా అతనికి ఉండేది. అందువలన తరచుగా హాస్పిటల్ కి వెళ్లి ఈసీజీ తీయించుకొని చూసి సంతృప్తిపడేవాడు. అక్కడ ఉన్న డాక్టర్లు నర్సులు ఈయన వస్తే ఈసీజీ తీయించుకోవడానికి వస్తాడు అని ఆయన వైపు చూసేవారు. అలా ఒక సంవత్సరం జరిగిన తర్వాత ఆయనను పట్టించుకోకుండా వదిలేశారు. ఎందుకంటే ఆయన యొక్క ఈసీజీ నార్మల్గానే ఉండేది. ఒక దినము అయనకు నిజముగా గుండె నొప్పితో వచ్చినప్పుడు అతనిని ఎవరూ పట్టించుకోలేదు అందరూ ఇతర రోగులతో బిజీగా ఉన్నందున అతడు ఎప్పుడు వస్తున్న వాడే కదా అని అశ్రద్ధ చేసి ఉండిపోయారు కానీ ఆయనకు నిజముగా గుండె నొప్పి వచ్చింది. ఆ దినము ఆయన మరణించాడు. ఇది నిజ సంఘటన. 

 

యోబు చెబుతున్నట్లు నేను భయపడిన కార్యము నాకు సంభవించింది అన్నట్లు ఆ యవ్వనస్తుడికి జరిగింది. ఈ రోగము నాకు వస్తుందేమో అని లేక క్యాన్సర్ వచ్చేస్తుందేమో అని రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు ఏదైనా నమూనాలు ఎక్కువ వస్తే చాలు వెంటనే తన హృదయ రోగము వచ్చేస్తుందేమో అని భయపడిపోతుండేవాడు. ఇది క్రైస్తవులను కూడా వదిలిపెట్టలేదు ఎక్కువగా వారు కూడా దుఃఖపడుతున్నారు. రోగం రావడానికి కంటే ముందుగా అది వస్తే మరణించిపోతామేమో అని చాలా భయం. బైబిల్లో అనేకచోట్ల భయపడకు అని చెప్పబడి ఉన్న మాటను మనం మరిచిపోతూ ఉన్నాం. 

 

యోబు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుని చూచినప్పుడు ఆయన మీద నిరీక్షణ వలన యోబు నిరీక్షణ ఎప్పుడూ విడవలేదు కాబట్టి దేవుడు సమస్త క్రియలు చేయగలరు. ఆయన తలంచిన ఏది కూడా నిరర్థకం కానేరదు (యోబు 42: 2) అంటున్నారు. మనకు కష్టము లేదా భయం వేస్తే అంతవరకు దేవుడు మనల్ని నడిపించిన మార్గములను అన్నింటిని మర్చిపోతున్నాం. యోబు భయపడకుండా సమస్త పరిస్థితిలను ఎదుర్కొన్నాడు. అలాగే మనము కూడా ఎలాంటి కార్యము జరిగిన మనతో ఉండి నడిపించిన దేవుని పైన ఆనుకుందాం. 

 

ప్రియమైన వారలారా! మీకు ఎలాంటి పరిస్థితుల్లో భయమేస్తుందో దానిని గూర్చి దేవుని ఎంత చెప్పండి. లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడుగా ఉన్నారు. ఇక దేనిని గురించి చింతించకుండా భయపడకుండా దేవుడు మనతోనే ఉన్నారు అనే విశ్వాసముతో జీవించడం నేర్చుకుందాం. జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఆమెన్! 

- బ్రదర్. శివా గారు 

 

ప్రార్థన అంశం:

ఫీల్డ్ లో అత్యవసరముగా ఉన్న 25 ద్విచక్ర వాహనాలు కొనడానికి సహాయం చేసే వ్యక్తులు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort