Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.11.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 29-Nov-2023

దిన ధ్యానము(Telugu) 29.11.2023

 

అంశం:- కోపగించవద్దు

 

"ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు" - యాకోబు 1:20 

 

ఒక యవ్వనస్తుడు ఎక్కువగా కోపపడుతూ ఉండేవాడు. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరిచి తన కోపాన్ని తగ్గించుకుంటాడు. ఒక దినము అతని యొక్క తండ్రి అతనికి ఒక సుత్తిని అనేక మేకులను ఇచ్చాడు. 

ఇకనుండి నీకు కోపం వచ్చినప్పుడు ఇంటి వెనకాతల ఉన్న గోడకు ఈ మేకులు కొట్టమని చెప్పాడు. అలాగే ఆ యవ్వనస్తుడు మొదటి రోజు పది మేకులు, రెండవ రోజు ఏడు మేకులు, తరువాత ఐదు, రెండు అని ప్రతిరోజు అమేకులు కొట్టడం వల్ల కోపము తగ్గుతూ వచ్చింది. ఒక దినం ఒకే ఒక మేకు మాత్రమే కొట్టాడు. ఆయన తన తండ్రితో అన్నీ కలిపి 45 మేకులు కొట్టాను కాబట్టి ఇక మీద నుండి నాకు కోపం రాదు అని తన తండ్రితో చెప్పాడు. అప్పుడు తండ్రి అతనితో ఇక మీద నుండి కోపము రాని రోజుల్లో ఒక్కొక్క మేకును ఆ గోడ నుండి పీకి వేయుము అన్నారు. కొట్టిన 45 మేకులు అన్నింటని కూడా రోజుకి ఒకటి చొప్పున అన్నింటిని పీకి వేశాను అని గర్వముగా తండ్రితో చెప్పాడు. వెంటనే నాన్న ఈ విధంగా చెప్పారు మేకులు అయితే తీసేసావ్ కానీ గోడకు ఉన్న ఆ రంధ్రాలను ఏం చేస్తావ్ అని అడిగారు. ఇలానే కోపము కూడా అనేకులను గాయపరిచి ఉంటుంది కదూ దానిని విన్నా యవ్వనస్తుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. 

 

ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు దేవుని చేత ఏర్పరచబడిన శ్రేష్టమైన నాయకుడు మోషే. మోషే కనాను దేశంలో ప్రవేశించడానికి ప్రజలను నడిపిస్తూ వెళ్లే మార్గంలో అనేక సమస్యలు అవసరతలు వచ్చాయి. మోషే ఇశ్రాయేలు యొక్క సమస్యల గురించి దేవుని వద్ద కనిపెట్టి దేవుడు తనతో చెబుతున్న సలహాలు అన్నింటిని కూడా విని వాళ్ళ యొక్క అవసరతలను అన్ని కూడా నెరవేర్చాడు. అలానే ఒకసారి ప్రజలకు నీళ్లు అవసరమైనప్పుడు దేవుడు మోషేతో ఆ ప్రజలు ఎదుట మోషే నీవు బండతో మాట్లాడము అప్పుడు బండ నుండి నీళ్లు వస్తాయి అన్నారు. అప్పుడు మోషే కోపముతో మాట్లాడడానికి బదులుగా తన చేతిలో ఉన్న కర్రతో ఆ బండను రెండుసార్లు కొట్టాడు మోషే కోపము చేత చేసిన ఆ క్రియ వలన కానానులోనికి ప్రవేశించలేకపోయిన పరిస్థితి వచ్చింది. 

 

ప్రియమైన వారలారా! ఇతరులను గాయపరచుట ఆపి వేసిన యెడల జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. కోపాన్ని విడిచిపెట్టాలి కోపము ఇతరుల యొక్క మనసును బాధపడేలా వారిని గాయపరుస్తుంది అని మనం గ్రహించిన యెడల ఎ ఒక్కరు కోప పడడము. మనం కోపములో మాట్లాడుతున్న మాటలు చేస్తున్న క్రియలు ఏదీ ప్రయోజనంగా ఉండదు కాబట్టి మన కోపాన్ని విడిచిపెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము అడిగి ఆయన చేతులకు మనలను సమర్పించుకుందాం. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు

 

ప్రార్థన అంశం :-

చత్తీస్గడ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచర్య గురించి ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet