Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.12.2023
Share:

By Village Missionary Movement

Friday, 01-Dec-2023

దిన ధ్యానము(Telugu) 01.12.2023

 

అంశం:- కథ తయారు

 

"గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని" - యిర్మియా 1:5

 

ఒక సినిమా తీయుటకు మొట్టమొదటిగా డైరెక్టర్ సిద్ధం చేసినది కదే. తర్వాత నాయకుడు, మ్యూజిక్, పాటలు, రచయిత అని అందరిని కూడా ఎంచుకొనుటకు ఆలోచిస్తారు. అదే సమయంలో సృష్టించిన డైరెక్టర్ అయిన దేవుడు మనము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మన జీవితమునకు సంపూర్ణమైన ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నారు. ఎంత ఆశ్చర్యం చూశారా? అవును నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నారు. మరియు మన అవయవాలు రూపింపబడుతున్న దినాలను ఆయన లెక్కించి యున్నారు. 

 

మన జీవితంలో మనం ఎదుర్కొన్న కార్యాలు ఏవి కూడా ఏదో యధావిధిగా హఠాత్తుగా జరగలేదు అన్ని దేవుని చేత ఏర్పరచబడినవే. మన ఇల్లు, తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ కూడా ఆయన ప్రణాళిక పరంగానే మనకు ఇచ్చి ఉన్నారు. సమస్తాన్ని సమృద్ధితో నింపుతున్న దేవుడు మన దేవుడు. ఎంత మాత్రము ఆయన కొదువను ఆశించే దేవుడు కాదు. మరియు సమస్తాన్ని ఆయా కాలంలో సక్రమముగా చేసే దేవుడు మన జీవితంలో కార్యాలన్నింటినీ కూడా గొప్ప ప్రణాళికతో వేసి మనల్ని పంపించినారు. మన కాలములు ఆయన హస్తములో ఉన్నవి కాబట్టి దారి తప్పిపోవుటకు అవకాశం లేదు. ఎందుకు యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వచ్చారు. ఆయన పుట్టుక మొదలుకొని మరణం వరకు సమస్తము దేవుని వాక్యము నెరవేరట్లే జరిగింది అని చదువుతున్నాం. పరిశుద్ధాత్మ చేత కన్యకైన మరియ గర్భంలో రూపింపబడినది మొదలుకొని బెత్లెహేములో జన్మించుట రెండు సంవత్సరముల చంటి పిల్లల్ని చంపుట, నజరేతుకు, వెళ్ళట బాప్తిసం పొందుట అన్ని తండ్రి యొక్క ప్రణాళిక ద్వారా నెరవేర్చారు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో మంచి సంబంధం కలిగి ప్రతి దినము ఆయన ప్రణాళికను పొందుకొని ఆ ప్రకారము చేసేవారు. ఎందుకు సిలువలో వేలాడేటప్పుడు కూడా తండ్రి చిత్తము నెరవేరునట్లు నేను దప్పికతో ఉన్నాను అంటున్నారు. 

 

దీన్ని చదువుతున్న స్నేహితులారా నేను ఎందుకు జన్మించాను? ఎందుకు జీవిస్తున్నాను? అని ఆలోచిస్తున్నారా? నీ పుట్టుకకు గొప్ప ఉద్దేశం కలదు. దేవుడు ఆయన కథను మీ జీవితంలో నెరవేర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయనతో కూడా నడిచిన యెడల కచ్చితంగా నడిపిస్తారు. దేవుడు మనల్ని మాత్రం విశేషంగా ఏర్పరచుకున్న దానికి గల కారణం మనల్ని ప్రత్యేకంగా చేసి ఉన్నారు. మీరు సాధారణమైన వారు కారు. ఆయన ప్రణాళికలో ఉంటున్న మీరు చాలా శ్రేష్టమైన వారు అనేదాన్ని ఎన్నడు మర్చిపోవద్దు. 

- బ్రదర్. కే. డేవిడ్ గణేష్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతా జరిగే పరిచర్యలో దేవుని హస్తము తోడై నడిపించినట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş holiganbet giriş çarkbet çarkbet giriş