Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.12.2023
Share:

By Village Missionary Movement

Saturday, 02-Dec-2023

దిన ధ్యానము(Telugu) 02.12.2023

 

అంశం:- ఎక్కువ తక్కువ

 

"కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు" - మత్తయి 9:37

 

ఒక మంచి గ్రామంలో చక్కటి కుటుంబము క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నది. ఆ కుటుంబంలో ఒక తల్లి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ తల్లికి ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తన ముగ్గురు బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యకు పంపించాలి అన్నదే. అదేవిధంగా నాగరికతలేని ఆదివాసీ ప్రజలు నివసించే వారి మధ్యకు ఆమె యొక్క మొదటి కుమార్తెను వారి మధ్య పరిచర్య చేయుటకు పంపించారు. ఆమె అక్కడికి వెళ్లిన కొన్ని నెలలలోనే విష జ్వరము చేత బాధపరచబడి వైద్య సదుపాయము లేనందువలన మరణించారు. తరువాత తనకుండిన ఇద్దరూ కుమార్తెలను పరిచర్యకు పంపించాలి అని ఆలోచించి తన బంధువులతో స్నేహితులతో చెప్పింది. అందుకు వారు వద్దు అని చెప్పి ఈ తల్లిని తిట్టడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆ తల్లి ఎవరి మాట పట్టించుకోకుండా తన ఇద్దరి కుమార్తెలను పరిచర్యకు పంపించారు. వారిద్దరూ అనేక సంవత్సరాలు చక్కగా పరిచర్య చేశారు. తరువాత వారు కూడా అదే రకమైన జ్వరం చేత మరణించారు. ఆ వార్త ఆ తల్లికి చేరింది. అప్పుడు ఆ తల్లి కృంగిపోయి ఏడ్చారు. అందరూ చెప్పారు మా మాట వినకుండా ముగ్గురు పిల్లలను నీ చేతులారా పోగొట్టుకున్నావ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏడిస్తే ఏమి ప్రయోజనం అని అన్నారు. నేను ఏడుస్తున్నది నా బిడ్డలు చనిపోయారు అని కాదు పరిచర్య కొరకు పంపిచుటకు నా దగ్గర ఇంకా పిల్లలు లేరే అని ఏడుస్తున్నాను అని ఆ తల్లి చెప్పారు. 

 

పేద విధవరాలు తన యొద్ద ఉన్న రెండు కాసులను కానుకల పెట్టెలో వేశారు. అప్పుడు యేసయ్య దాన్ని చూచి కానుక పెట్టెలో కానుక వేసిన వారందరి కంటే ఈమె ఎక్కువగా ఇచ్చింది అని చెప్పారు. అలాగైతే ఆ పేద విధవరాలు తనకని ఏమి పెట్టుకోకుండా సమస్తాన్ని దేవుని కొరకు ఇచ్చేసింది. 

 

దీనిని చదువుతున్న దేవుని పిల్లలారా పేద విధవరాలు తమ యొద్ద ఉన్న సమస్తాన్ని దేవుని కొరకు ఇచ్చారు. దేవుని దృష్టిలో అది విలువ కలిగినదిగా ఉన్నది. ఈ దినం లోకంలో పనికొరకు, చదువుల కొరకు ఎంతోమంది ఎదురుచూస్తూ ఉన్నారు కానీ దేవుని పరిచర్య చేయుటకు ఎవరూ లేరు కోత విస్తారంగా ఉన్నప్పటికీ పనివాడు తక్కువగా ఉన్న ఈ కాలంలో పనివాళ్ళుగా మీరు వస్తారా అని యేసయ్య మిమ్మల్ని అడుగుతున్నారు. అయితే మీరు జ్ఞానం లేని వారు కావచ్చు, బలహీనులు కావచ్చు అయినను పర్వాలేదు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో జ్ఞానము లేని వారిని ఏర్పరచుకున్నారు. ఈ దినం మనం ఎవరైనా సరే ముగింపు కొరకు ఆలోచించకుండా దేవుని పరిచర్య చేద్దాం. మీ యొద్ద ఉంటున్న వాటిని దేవుని కొరకు విత్తండి. ఈ దినం మనం వేసిన విత్తనం యొక్క ఫలితాన్ని మన కళ్ళు చూడకపోయినను కచ్చితంగా దాని యొక్క ఫలితం ఒక రోజు విస్తారంగా ఉంటుంది. 

- శ్రీమతి. భువిత ఎబినేజర్ గారు

 

ప్రార్థన అంశం:-

పదివేల గ్రామాలలో పరిచర్య చేసె ప్రణాళికలో అనేకమంది సేవకులు మనతో కలిసి పనిచేసేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban holiganbet setrabet marsbahis giriş vaycasino giriş