Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.12.2023
Share:

By Village Missionary Movement

Monday, 04-Dec-2023

దిన ధ్యానము(Telugu) 04.12.2023

 

అంశం:- రక్షకుని యొక్క రాకడ

 

"సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు" - జెకర్యా 9:9

 

రక్షకుని యొక్క మొదటి రాకడ జరగబోతున్న సంఘటనను సుమారు 500 సంవత్సరాలకు మునుపు జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచించారు. రాబోతున్న వ్యక్తి నీతిమంతుడైన దేవునిగా లోక పాపము నుండి విడుదల కలుగజేసి రక్షించడం మాత్రమే కాదు దీనత్వము గలవాడిగా ఉంటారు అని చెప్పినట్లు ఆయన తన దీనత్వమును చూపించుటకు రాజభవనంలో జన్మించకుండా పశువుల పాకలో జన్మించారు. 

 

యేసుక్రీస్తు పుట్టి జీవించి మరణించడానికి ముందు ఒక గాడిద మీద వచ్చి ఎరుషలేము లోనికి చేరుకున్నారు. జకర్య చెప్పినట్లు నెరవేరినదాన్ని మత్తయి సువార్త 21:4-11 వరకు చదువుతున్నాం. జకర్యా 9:9 లో చెప్పబడినట్లు అది నెరవేరింది అని చూస్తున్నాం. రక్షకుని యొక్క రాకడ గురించి ప్రవచించిన వారిలో జకర్యా ప్రాముఖ్యమైన ప్రవక్త. మొదటి రాకడ మాత్రమే కాదు రెండవ రాకడ గురించి కూడా ప్రవచించి ఉన్నాడు. యెహోవా బయలుదేరి యుద్ధ దినములో పోరాడుతున్నట్లు ఆ ప్రజలతో పోరాడును (జకర్యా 14:3- 4).ఇలాగు మన రక్షకుడు యొక్క రెండవ రాకడ గురించి కూడా ప్రవచించినారు జకర్యా ప్రవక్త. ఆ రక్షకుడు ఎలాంటివారు ఆయన దీనత్వం గలవారు నీతి గలవారు రాజుగా వస్తారు కానీ ఇక రాబోతున్న రాజు అంత్య క్రీస్తు యొక్క పరిపాలనను పతనము చేసి భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన చేయబోతున్న రాజు. మనలను ఆ పరిపాలన లో అర్హత కలవారిగా చేయుటకు తను ఇష్టపడుతున్నారు. ఆయనతో కూడా శ్రమలను సహించిన యెడల ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. 

 

మొదటి రాకడ మనకు రక్షణ విమోచన తీసుకువచ్చింది మన పాపములు శాపములు కడగబడడానికి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము సీలువలో కార్చబడింది. ఆ పరిశుద్ధ రక్తం చేత మనము కడగబడినప్పుడు ఎంతో సంతోషము సమాధానము హృదయంలో కలుగుతుంది. మనం ఇదే సిద్ధపాటుగా ఉండిన యెడల మనము ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు కూడా మనం ఆయనను ఎదుర్కొంటాం. ఇప్పటివరకు ఈ ఆనందాన్ని కనుగొనని వారు అనేకులు. ఆయనతోపాటు నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు సిద్ధం చేసిన కార్యములు అనేకముగలవు. దేవుడు తమను ప్రేమించిన వారికి సిద్ధము చేసినవి కనులకు కనబడలేదు చెవులకు వినబడలేదు హృదయములో గోచరము కాలేదు (1కోరింది 2:9).

 

అవును దేవుడు మన కొరకు సిద్ధం చేసిన వాటిని మనం ఆలోచించిన కూడా చూడలేనివై మహోన్నతముగా ఉన్నాయి. కాబట్టి వాటిని పొందుకొనుటకు సిద్ధపడదాం. రక్షకుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది. మొదటి రాకడను గుర్తించేసుకుంటు ఈ క్రిస్మస్ ఆచరించుటలో నిలబడి పోకుండా ఆయన రెండవ రాకడ గురించి మనమందరం సిద్ధపడదాం. మనము సిద్ధపడతాం ఇతరులను కూడా సిద్ధపరుద్దాం. ఆమెన్! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:

పదివేల గ్రామలలో సువార్త ప్రకటించుటకు ఒక్కో గ్రామానికి సపోర్ట్ చేయుటకు వెయ్యి రూపాయలు ఇచ్చే అనేకులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet betgit radissonbet