Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.12.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 12-Dec-2023

దిన ధ్యానము(Telugu) 13.12.2023

 

అంశం:- ఆశ్చర్యకరుడు

 

"ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును" - యెషయా 9:6

 

అపోస్తులుడైన పౌలు క్రీస్తు మనలో జన్మించాలి అని అంటున్నారు. క్రీస్తు మనలో జన్మించిన ఆ దినము మొదటి క్రిస్మస్ ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ దినము మన జీవితంలో ప్రవేశించిన ఆ ఆశ్చర్యకరుడు యొక్క ఆశ్చర్య కార్యములను అనుదినము అనుభవించి సంతోషించుటయే క్రైస్తవ జీవితం. అలా ఆశ్చర్యకరుడైన ప్రభువు డి.ఎల్ .మోడీ అనే దేవుని దాసుని యొక్క జీవితంలో చేసిన ఒక సంఘటన చూద్దామా. 

 

ఒకమారు డి.ఎల్.మోడీకి చాలా డబ్బులు అవసరం ఉండేది. పరిచర్యకు అవసరత, తన కుటుంబం యొక్క అవసరాలు మధ్యలో కొన్న కారుకు 14 డాలర్లు కట్టవలసి ఉంది. 14 డాలర్లు కట్టకపోతే కారును తీసుకుపోతారు రేపటిలోగా 14 డాలర్లు అవసరము ఎవరిని అడగాలో అర్థం కాలేదు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో యేసయ్య దగ్గర ఇలా ప్రార్ధించారట ప్రభువా మిమ్మల్ని పరిశోధించి చూడమన్నారు ఆకాశపు వాకిళ్లను తెరచి నా అవసతుల సంధించండి అని ప్రార్థించి దేవుడు చూచుకుంటారు అద్భుత కార్యము చేస్తారు అని విశ్వాసంతో పడుకోడానికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే ఉదయం లేచి చూసేసరికి తన ఇంటి ముందు అక్కడక్కడ డబ్బులు పడి ఉండుట చూశారు. ఆశ్చర్యం ఏమిటంటే కారుకు కట్టవలసిన 14 డాలర్లు సరిగా ఉన్నాయి. దేవుడు ఆశ్చర్యకరుడు ఆయనను అంగీకరించిన అందరికీ అవసరమైన సమయంలో మన యొక్క విశ్వాసమును చూసి అద్భుతాలు చేస్తారు. ఏసుక్రీస్తు ప్రభువు నిన్న, నేడు, , నిరంతరం ఓకే రీతిలో ఉన్నారు. 

 

 బైబిల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను చెప్పలేనంతగా ఉన్నాయి. సారేపతు విదవరాల యొక్క జీవితంలో కరువు కాలము ముగిసే వరకు తన తొట్టిలో ఉన్న పిండి, నూనె తగ్గిపోలేదు అని చూస్తున్నాం. కానా ఊరిలో జరిగిన వివాహంలో నీటిని ద్రాక్ష రసంగా మార్చిన దేవుడు. ఐదు చేపలు రెండు రొట్టెలు 5000 మందికి పోషించిన అద్భుతం. ఒక మారు పేద విధవరాలు మరణించిన తన యొక్క యవ్వన కుమారుని మరలా ప్రాణంతో లేపి చేసిన అద్భుతం. 

 

ప్రియమైన వారలారా! మనము దేవుని ఆశ్చర్యకార్యములను అద్భుతాలను నమ్మి ఈ దినము ఏదో ఒక అద్భుతం కొరకు మీరు వేచి ఉన్నారా? ఆయన ఆశ్చర్యకరుడు అని మీరు విశ్వసించండి కచ్చితంగా ఆయన మీ జీవితంలో చేసే ఆశ్చర్యాన్ని మీరు చూస్తారు. 

- బ్రదర్. శ్యామ్ మోరిస్ గారు 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో ఆకలి గలిగిన వారికి ఆహారం ఇచ్చే పరిచర్య ద్వారా ప్రయోజనం పొందుకుంటున్న వారి కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet