Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.01.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 03-Jan-2024

దిన ధ్యానము(Telugu) 03.01.2024

 

అంశం:- లాభకరమైన విత్తనం

 

"ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును" - సామెతలు 11:26

 

నా తండ్రి కర్పయ్య యేసయ్యను ఎరుగని వ్యక్తి. ఒకసారి మనం నడిపించే యవ్వనస్తుల కూడిక యొక్క వాల్ పోస్ట్ చూసి నా యొద్దకు వచ్చి పెద్ద మీటింగ్ నడిపించబోతున్నావా అని అన్నారు. నేను అందుకు అవును అన్నాను. ఎంతమంది వస్తారు అని అడిగారు. నేను 50,000 మంది యవనస్తులు వస్తారు అని చెప్పాను. ఇందువలన మనకు ఏదైనా లాభము కలదా అని అడిగారు. అందుకు నేను అవును మనకు చాలా ఎక్కువ లాభము ఉంటుంది అన్నాను. 

 

ఇలాగే మన అవసరతను తీర్చి మనలను సంరక్షించే దేవుడు మన వలన లాభం కలుగుతుందా లేదా ఏదైనా ప్రయోజనం కలదా అని దేవుని పక్షమున నిలబడి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. నా వలన దేవునికి ఏమి లాభము ఇవ్వగలను అని ఆలోచిస్తున్నారా? క్రైస్తవ చరిత్రను తిప్పి చూసిన ఎడల అనేకులు తమయొక్క తలాంతులు, సమయాన్ని, ధనాన్ని అంతెందుకు తమను తామే విత్తనముగా అర్పించుకున్న విధానాన్ని బట్టి నీవు నేను దేవున్ని తెలుసుకున్నాం. రాంగ్ ల్యాండ్ అనే ఒక విత్తనం విత్తడం వలన శివకాశి అనే ప్రాంతంలో అనేకమంది ప్రభువును అంగీకరించారు. సారా టక్కర్ తన యొక్క ధనమును తిరునల్వేలిలో విత్తడం వలన ఫలితముగా సారా టక్కర్ స్కూల్, కాలేజ్ ఏర్పడింది. ఇందువలన దేవుని తెలుసుకున్న విద్యార్థులు అనేకులు. ఒక టమాట పండులో ఎన్ని విత్తనాలు ఉంటున్నాయో అలాగే మనలో దేవుని యొక్క జీవము, తలాంతులు, ధనము, సమయము మన పిల్లలు వంటి విత్తనాలు మనకు దయచేసి ఉన్నారు. దేవుడు ఇచ్చిన విత్తనాలను ఆయన కొరకు విత్తేటప్పుడు

అది మరి ఎక్కువగా ఫలితాన్ని చూడగలం. దేవుని రాజ్యానికి లాభము తెచ్చిపెట్టే వారంగా ఉంటాం కానీ ఆ విత్తనాలు విత్తకుండా దాచిపెడితే అనగా వాడబడకుండా ఉంటే అందువల్ల ఏ ప్రయోజనం లేదు. అపోస్తులుడైన పౌలు దేవుడు ఆయనకు ఇచ్చిన సమస్తాన్ని దేవుని కొరకు ఇచ్చి తనకు లాభమైన వాటి అన్నింటిని నష్టముగా దేవుని రాజ్యం కొరకు ఎంచుతున్నాను అని తాను చేసిన కార్యాలను విత్తనాలుగా విత్తిన దానిని చెబుతున్నారు. అనేక విలువగల విత్తనాలు విత్తరా లేదా స్వార్థముతో మీ కొరకు మాత్రమే పని చేస్తూ ఉన్నారా? మీ సమయాన్ని, మీ తలాంతులను, మీ జీవమును, మీ ధనమును, పిల్లలను దేవుని కొరకు విత్తేటప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని చూడవచ్చు. పరలోకం మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. దేవుడు మీ ద్వారా మహిమ పరచబడతారు. స్వార్ధముతో మీకు మీరే దానిని బిగబట్టి ఉంచిన యెడల ప్రజలు మిమ్మల్ని శపిస్తారు అని పైన చెప్పబడిన వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ సంవత్సరంలో వెల్లుడి అనే అంశము కింద ఈ సంవత్సరాన్ని పాటిస్తున్నాం. దేవుడు మనకు ఇచ్చిన కార్యాలను మనలో మనము దాచుకొని ఉంచుకొనకుండా విస్తారముగా విత్తడానికి బయలుదేరుదాం మొదటి అడుగు పెడదాం దేవుడు మనల్ని దీవిస్తారు. 

- బ్రదర్. కే. డేవిడ్ గణేష్ గారు

 

ప్రార్థన అంశం:-

దేబోరా గుంపుల ద్వారా దర్శింపబడుతున్న గ్రామాలలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet jojobet grandpashabet grandpashabet palacebet sonbahis jojobet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet