Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.01.2024
Share:

By Village Missionary Movement

Friday, 05-Jan-2024

దిన ధ్యానము(Telugu) 05.01.2024

 

అంశం:- సువార్త అనే విత్తనం

 

"వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను" - నిర్గమకాండము 2:4

 

నా యొక్క సొంత ఊరు సాద్దూర్. సాద్దూర్ లో గల ఆండాళ్ పురం అనే చిన్న ప్రాంతం. అక్కడకు శివకాశి నుండి హెప్సిబా అనే ఒక అక్క మా వీధికి వచ్చారు. చేతిలో బైబిల్ తో తెల్ల బట్టలు ధరించుకొని నవ్వుతో కూడిన ముఖముతో మా వీధికొచ్చి 15 మంది యవ్వనస్తులను ఒకచోట సమకూర్చి ఏసుప్రభు యొక్క ప్రేమను ప్రకటించారు. మా చేతికి కొత్త నిబంధనలు ఇచ్చి చదవమని చెప్పి వెళ్లారు. మరుసటి వారం ఆమె వచ్చినప్పుడు నేను తప్ప వేరే ఎవరు అక్కడ లేరు. నేను ఒక్కడినే అక్కడ ఉన్నాను. నాకు ఏసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి ఇంకా చెప్పడం మొదలుపెట్టారు. మరియు నా కుటుంబం కొరకు ప్రార్థించారు. ప్రతి వారము నా యొద్దకు వచ్చి ప్రభువు గురించి మాట్లాడుతూ నాలో కలిగిన అనేక మార్పులను కల్లారా చూడడం ప్రారంభించారు. ఆ దినము నుండి నాలో ఉన్న చెడు అలవాట్లు వెళ్లిపోయాయి. నా కుటుంబంలో ఒక మంచి కుమారుడిగా ఎదగడం ప్రారంభించాను. ప్రతి వారము పక్కనే ఉన్న చర్చికి వెళ్లి బాప్తిసం పొందుకొని తరువాత దినాల్లో యేసు క్రీస్తు ప్రేమను మా వీధిలో ఉన్న చిన్నపిల్లలకు చెప్పడం ప్రారంభించి చిన్న పరిచర్య ప్రారంభించినప్పుడు హెప్సిబా అక్క నన్ను చూసి చాలా సంతోషించారు. తర్వాత నన్ను సంపూర్ణ సేవకు సమర్పించుకొని గడిచిన 16 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తూ వస్తున్నాను. ఉత్తర భారత దేశంలో చత్తీస్గడ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సేవకులను తయారు చేస్తే మహోన్నతమైన పనులలో గ్రామ మిషనరీ ఉద్యమం ద్వారా పనిచేస్తున్నాను. 

 

ఈ దినము లేఖనములో కూడా చిన్నది అయిన మిరియం యొక్క జ్ఞానం గురించి ధ్యానం చేద్దాం. ఆ దినాలలో అక్కడ జన్మించే మగ పిల్లలందరినీ కూడా చంపివేయాలి అని పరో యొక్క ఆజ్ఞ ఐగుప్తు దేశంలో ప్రకటించబడింది. కానీ ఒక తల్లి తన చిన్న కుమార్తెతో తన కుమారుడిని కూడా కాపాడాలి అని ఆలోచించింది. అప్పుడు ఒక చిన్న పెట్టెలో శిశువులను పెట్టి దానిని నదిలో విడిచి పెట్టేసింది. ఐగుప్తు రాజు యొక్క కుమార్తె అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు మిరియము ఆమె వద్దకు వెళ్లి జ్ఞానముతో మాట్లాడి ఆ శిశువును కాపాడుటకు చేయగలిగిన పని అంతా చేసింది. చివరిగా ఆ శిశువు కాపాడబడింది. అతనికి మోషే అని పేరు కూడా పెట్టబడింది. తర్వాత దినాల్లో ఆ మోషే గొప్ప నాయకుడిగా మారాడు. 

 

దీన్ని చదువుతున్న స్నేహితులారా హెప్సిబా అనే ఒక అక్క సువార్తను విత్తడం వలన నా జీవితంలో గొప్ప ఫలితాన్ని నేను చూడగలిగాను. ఉత్తర భారత దేశంలో సేవకులను తయారు చేసే సేవకుడిగా నన్ను మార్చింది. మిరియాము చేసిన చిన్న ప్రయత్నం గొప్ప నాయకుడిని తయారు చేసింది. స్నేహితులారా మీరు కూడా సువార్తను వ్యక్తులు ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నారా? అది మనిషి యొక్క రక్షణకు మాత్రమే కాదు మీరు అడుగుపెడుతున్న చిన్న అడుగు కూడా అనేకమందికి ప్రయోజనకరంగా ఉండవచ్చు. కాబట్టి మీరు చేస్తున్న ప్రయాస చిన్నదిగా ఉండవచ్చు కానీ తర్వాత దినాల్లో గొప్ప ఫలితాన్ని ఇవ్వగలదని మర్చిపోకండి. కాబట్టి మీరు చేయగలిగినంత కార్యాన్ని ఇతరులకు యేసయ్య గురించి చెప్తూ చేయండి. మీరు ఆ విత్తనాలు విత్తుడి దేవుడిదాన్ని ఫలింప చేస్తారు. 

- బ్రదర్. శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

దేబోరా గుంపుల్లో కలిసి ఉన్న స్త్రీల యొక్క కుటుంబాలను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet