Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.01.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 09-Jan-2024

దిన ధ్యానము(Telugu) 09.01.2024

 

అంశం:- మాటలు అనే విత్తనం

 

"జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు" - సామెతలు 18:21

 

డి.ఎల్ మూడీ అనే ప్రసంగికుడిని ఒక గొప్ప న్యాయమూర్తి భార్య తన ఇంటికి పిలిచి అయ్యా నా భర్తకు సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించండి అని బ్రతిమలాడింది. మూడీ అయితే చాలా గొప్పగా చదువుకున్న చదివరియైన న్యాయమూర్తితో ఎలా మాట్లాడాలి అని కలత చెందారు. అందుకొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత ఆయన ఇంటికి వచ్చి న్యాయమూర్తి మీరు రక్షింపబడినప్పుడు నాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ న్యాయమూర్తి యొక్క భార్య అయితే చాలా నిరుత్సాహపడింది. సంపూర్ణ సువార్త చెప్పకుండా ఒక్క మాట చెప్పి వెళ్లిపోయారే అని డి.ఎల్ మూడీ పైన కోపగించుకున్నారు. కానీ జరిగిందేమిటో తెలుసా? ప్రసంగీకుడు యొక్క మాటలు జడ్జి జీవితంలో గొప్ప కదలిక తీసుకువచ్చింది. ఆ దినమే జడ్జ్ రక్షింపబడ్డారు. 

 

తండ్రి అయిన దేవుడు శూన్యముగా ఉండిన ఈ భూమిలో తన మాటల చేత సమస్తాన్ని సృష్టించారు. పశువులను సృష్టించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో అని చూచుటకు వాటిని ఆయన వద్దకు తీసుకువచ్చారు అని ఆదికాండము 2వ అధ్యాయంలో చదువుతున్నాం. మన నోటి నుండి బయలుదేరుతున్న మాటలను దేవుడు గమనించి వినేవారుగా ఉన్నారు (మలాకి 3:16).

 

ఏసుప్రభు యొక్క నోటి నుండి వచ్చే మాటలు ఎంత పదును కలిగిన ఆయుధములుగా ఉన్నాయో చూడండి. నిమ్మలముగా ఉండము, లాజరు బయటికి రమ్ము, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము, వెళ్ళవచ్చు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అనే మాటలు పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నిండి ఉన్నాయి. ఆయన మాటలు ప్రేమ కలిగిన మాటలు, కనికరము గలిగిన మాటలు, కృప కలిగిన మాటలు ఇవి అనేకులకు ఆదరించేవిగాను, గాయములు కట్టేవిగాను, స్వస్థ పరిచేయుగానే ఉండేవి. 

 

 ప్రియమైన వారలారా! మన పొలంలో విత్తనాలు విత్తేటప్పుడు ఆ విత్తనంలో గల జీవము తన పోలికలోనే అనేక విత్తనములు ఇచ్చే చెట్లను కొమ్మలను సృష్టించి ఫలములను ఇచ్చే విధముగా ఎదుగుతుంది. మనుష్యుడు దేనిని విత్తుతాడొ దాన్ని కోస్తాడు. మనం మాట్లాడుతున్న మాటలే అనేకులను యేసుప్రభు వద్దకు నడిపించే మాటలుగా ఉండాలి. కాబట్టి వ్యతిరేకమైన కార్యాల కొరకు ఆలోచించడం పక్కన పెట్టి మంచి కార్యాలను విశ్వాసముతో దేవుని సన్నిధిలో చెబుదాం. మన నాలుక దేవుని కొరకు ప్రతిష్ట చేద్దాం. ప్రభువా నేను మాట్లాడితే నా మాటలు కల్వరి ప్రేమతో నిండిన మాటలు వలే ఉండాలి. నీ చిత్తానుసారముగా మాట్లాడాలి అన్నదే మన ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనగా ఉండనివ్వండి. ఇలా మాటలోనే విత్తనాలను విత్తి ఆత్మలను సొంతం చేసుకుందాం. 

- శ్రీమతి. జబకని శేఖర్ గారు 

 

ప్రార్థన అంశం:

కన్మణికేల్ అనే టీవీ కార్యక్రమం ద్వారా దర్శించబడుతున్న పిల్లల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş holiganbet giriş matbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet