Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.01.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 10-Jan-2024

దిన ధ్యానము(Telugu) 10.01.2024

 

అంశం:- ఎంచబడిన విత్తనం

 

"నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు" - ఆదికాండము 6:9

 

ఒక అడవిలో గుంపుగా ఏనుగులు నివసిస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా గుంపులుగానే వెళుతూ ఉంటాయి. దాంట్లో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగు ఉండేవి. మంచి ఆహారం కొరకు ఏనుగులు ఒక స్థలం నుండి మరొక స్థలమునకు వెళుతూ ఉంటాయి. అలా ఏనుగులు గుంపులుగా వెళ్లేటప్పుడు ఆ పిల్ల ఏనుగు ఎక్కడికి వెళ్ళిందో తెలియక తల్లి ఏనుగు దాన్ని వెతకడం మొదలు పెట్టింది. కొన్ని దినముల తర్వాత తన పిల్లను ఆ ఏనుగు కనుగొనగలిగింది. ఎంత గుంపుగా ఉండినా తన పిల్లను బాగా ఎరిగి ఉండుట వలన కనిపెట్టగలిగింది. అలాగే దేవుడు పాపము మరియు నటనతో నిండిన లోకంలో ఆయన పిల్లలను బాగా ఎరిగి ఉంటారు.  

 

దేవుడు ఈ లోకంలో మనుషులను సృష్టించారు. వాళ్లు విస్తరించారు పాపము విస్తరించింది. మనుషుల యొక్క పాపమును చూచిన దేవుడు పశ్చాత్తాపపడి లోకాన్ని పతనం చేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఇంతగా పాపముతో నిండి ఉన్న మనుషుల్లో నీతిమంతునిగా ఒక వ్యక్తి కనబడ్డాడు. అయన ఎవరో తెలుసా? ఆయనే నోవాహు. దేవుడు ఈ నోవహు కుటుంబాన్ని మాత్రమే కాపాడి సమస్త జనులను జలములతో పతనము చేశారు. ఈ లోకంలో ఒక నూతన సంతతి రావడానికి దేవుడు నోవాహును ఒక విత్తనముగా ఏర్పరచుకున్నాడు. ఆయన ద్వారా దేవుడు తన యొక్క ప్రణాళికను ఈ యొక్క ప్రపంచంలో నెరవేర్చారు. 

 

ప్రియమైన వారలారా! ఈ దినము కుటుంబముగా జీవించబోతున్న ప్రతి వ్యక్తి కుటుంబ నాయకులుగా తమ కుటుంబమునకు తామే బాధ్యత అనేదాన్ని గ్రహించి పనిచేయాలి. మనం మంచి విత్తనాలుగా దేవున్ని ఇష్టపెట్టే విధముగా జీవించినప్పుడు మన కుటుంబము దేవుని యొద్ద ఎదుగుదగు కారణమవుతాం. నోవాహువలె దేవుడు మనల్ని నమ్ముతున్నారు. మనము దేవుని యందు కలిగి ఉన్న భక్తి జీవితం ఒక విత్తనం. దాని ద్వారా దేవుని యెడల భక్తి కలిగిన సంతానము తయారవుతుంది అనేది కచ్చితం కాబట్టి ఆయన మనకు ఇచ్చిన పిల్లలను, బంధువులను బాధ్యతతో శ్రద్ధతో కాపాడుకుందాం. లోకంలో కలిసిపోకుండా దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబముగా జీవించిన యెడల గొప్ప ఫలితాన్ని పొందుకుంటాం. ఏర్పరచబడిన వారమైన మనము మాదిరి కరమైన జీవితం జీవించేటప్పుడు మన పిల్లల ద్వారా వచ్చే సంతానము దేవుని భక్తి గల సంతానముగా ఉంటుంది అనేదాంట్లో ఎటువంటి సందేహం లేదు. 

- శ్రీమతి. బేబీ కామరాజు గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో నడిపించబడుతున్న హాస్పిటల్ పరిచర్యలో యొద్దకు వస్తున్న అనేకమంది దేవుని యొక్క ప్రేమను ఎరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet