Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.01.2024
Share:

By Village Missionary Movement

Thursday, 11-Jan-2024

దిన ధ్యానము(Telugu) 11.01.2024

 

అంశం:- ఉద్యమం అనే విత్తనాలు పడిన హృదయం

 

"బెసలేలును అహోలీ యాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి నందరిని మోషే పిలిపించెను" - నిర్గమకాండము 36:2

 

ఉద్యమం గురించి ఎక్కువగా మాట్లాడుతున్న దినం ఇది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం గురించి కూడా దాని పనులు అన్నింటినీ గురించి దానికి అవసరమైన అవసరాలు అన్నింటిన గురించి మోసే ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారిలో ఎవరి హృదయాన్ని దేవుడు ప్రేరేపించి వారి ఆత్మను ఉత్సాహపరిచారో వాళ్ళందరూ ప్రత్యక్ష గుడారము పనికి దానికి సంబంధించిన సకల పనులకు, పరిశుద్ధ వస్త్రములకు తగిన కార్యాలను దేవునికి కానుకగా తీసుకొచ్చారు. దేవుని పరిచర్యకు సంబంధించిన సకల విధములైన పనులన్నీ కూడా చేశారు. ఎందుకంటే దేవుని పని ఘనమైనది అనేదాన్ని గ్రహించిన వారు ప్రశాంతంగా ఉండలేకపోయారు. తీవ్రతతో దేవుని కొరకు పనిచేశారు. 

 

ఒక గ్రామంలో క్రైస్తవ యవనస్తుడు ఒకరు పాపములోను అక్రమములోనూ దేవునికి ఇష్టము లేని కార్యములను జీవిస్తూ ఉండేవాడు. సమస్త ప్రజల యొక్క పాపముల కొరకు శాపం కొరకు సిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి మూడవరోజు తిరిగి లేచిన ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఉజ్జీవము అనే విత్తనము ఒక దినమున హృదయములో పడింది అది పనిచేయడం ప్రారంభించింది. అంతవరకు దేవుని కొరకు ఏమి చేయని ఆయన తర్వాత ఊరికే ఉండలేకపోయాడు ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి అని ఆలోచించాడు. అక్కడ ఉన్న మందిరమునకు వెళ్లి సాయంకాలంలో మరియు రాత్రి వేళలో పాటలు పాడుతూ ఏసుక్రీస్తు నామమును మహిమ పరుస్తూ ఉండేవాడు. బైబిల్ చదువుతుండేవాడు. దేవుని ఆలయపు పనులు ఆసక్తితో పాల్గొని కానుకలను ఉత్సాహంగా ఇచ్చేవాడు. ఎవడైనను తనతో మాట్లాడితే వాళ్ళకి ఎలాగైనా యేసయ్య గురించి చెప్పాలి అని ఎక్కువ ప్రయత్నించేవాడు. ఎంఏ, ఎంఫిల్ ముగించుకుని పీహెచ్డీ చదువుతున్నప్పుడు ప్రభువు ఏడుస్తున్నారు అనే సందేశం చదివి తన చదువును విడిచిపెట్టి ఆలస్యము చేయక దేవుని ఘనమైన పరిచర్య చేయుటకుగాను తనను సమర్పించుకున్నాడు. ఈ దినము కుటుంబముగా ఆయన పరిచర్య చేయుటకు దేవుడు తనకు వాడుకుంటున్నారు దేవునికి మహిమ కలుగును గాక. 

 

ప్రియమైన సహోదరి సహోదరులారా ఉజ్జీవము అనే విత్తనాలు పడిన హృదయము ఖాళీగా ఉండదు అది ఫలితాన్ని దేవుని కొరకు ఇస్తూ అనేకులను ప్రయోజకులుగా మార్చుతుంది. దీన్ని చదువుతున్న వింటున్నా మీకు హృదయములో ఉజ్జీవపు విత్తనం పడి ఉన్నదా? 

- బ్రదర్. సిమ్యోన్ గారు 

 

ప్రార్థన అంశం:-

యేసు యొక్క సంతతి ద్వారా దర్శింపబడుతున్న చిన్నారుల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet