By Village Missionary Movement
Friday, 12-Jan-2024దిన ధ్యానము(Telugu) 12.01.2024
అంశం:- విత్తనము మరియు కోత
"నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా-నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు" – 1 సమూయేలు 2:30
ఇస్సాకు విత్తనం విత్తినప్పుడు నూరంతల ఫలితం పొందాడు. ఎలా నూరంతల ఫలితం దొరికింది? దేవుడు దీవించుట చేతనే. యెహోవా అతనిని ఎందుకు నూరంతర దీవించారు అని చూసిన యెడల ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై నీవు ఐగుప్తునకు వెళ్లకుండా నేను నీకు చూపించిన దేశము నందు నివసించుము అని చెప్పిన దానికి ఆయన లోబడటం వలన ఆయన విత్తినది నూరంతలుగా ప్రభువు దీవించారు. అంత మాత్రమే కాదు ఫిలిస్తీయులు ఆయన మీద అసూయపడేటట్లు ఆయనను దీవించి విస్తరింప చేశారు.
నా ప్రియమైన వారలారా! ఈ దినములలో మీరు ఎదురుచూస్తున్న దీవెనలు మీకు మీ పరిచర్యలో లేదా? మీరు పని చేస్తున్న పనిలో జీతము సరిగా లేదా? మీ చేతి ప్రయాసకు తగిన రాబడి లేదా? మీ పనిలో ఎంత మాత్రం అభివృద్ధి లేదా? ప్రియాసకు తగిన ఫలితము విత్తనమునకు తగిన పంటను కోయలేకపోతున్నారా? మీరు మీ పనులను ఆలోచించి సరిచేసుకోవాల్సిన సమయం ఇది. మీ పరిచర్యను దేవుడు చెప్పిన స్థలములో చేస్తున్నారా? మీయొక్క పని స్థలములో దేవుని కొరకు నిజాయితీగా సాక్షిగా జీవిస్తున్నారా? మీ పనులలో క్రింద ఉన్న కార్యాలు చేస్తున్నారా?
1. మీరు చేసే వ్యాపారం లేదా పని దేవునికి ఇష్టమైనదేనా?
2. మీ మీ వ్యాపారం లేదా పనిని రోజు ప్రార్థించి ప్రారంభిస్తున్నారా?
3. మీ వ్యాపారం యొక్క పార్ట్నర్ దేవుని చిత్తానుసారముగా మీతో కలిసి ఉన్నారా?
4. మీ వ్యాపారము యొక్క రాబడి ద్వారా దేవుని పరిచర్యకు దీవెన కరముగ ఉంటున్నారా?
ప్రియమైన వారలారా! దేవుని సన్నిధిలో వేచి ఉండి పైన చెప్పబడిన కార్యాన్ని ప్రార్థనతో ప్రారంభించి చూడండి. దేవుని మాటకు లోబడుట ఆశీర్వాదమునకు ఊట అనేదాన్ని మర్చిపోవద్దు. ఇస్సాకు వలె లోబడుడి అప్పుడు మీ యొక్క పరిచర్యను పనిని వ్యాపారాన్ని దేవుడు 100 రెట్లు దీవించి ఇస్సాకు వలె హెచ్చిస్తారు.
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును (యెషయా 48:18)
- బ్రదర్. కే . బెంజిమెన్ గారు
ప్రార్థన అంశం:-
రేపు జరగబోతున్న శిష్యుల తర్ఫీదు క్యాంపునకు కావలసిన ఆర్థిక అవసరతలు తీర్చబడేటట్లు అనేకమంది యవ్వనస్తులు పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250