Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.01.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 14-Jan-2024

దిన ధ్యానము(Telugu) 14.01.2024 (Kids Special)

 

అంశం:- ప్రేమే ప్రధానమైనది

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

"ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము" - మత్తయి 1:23

 

హలో పిల్లలు ఎలా ఉన్నారు? కొత్త సంవత్సరం వచ్చేసింది కొత్త సంవత్సరాన్ని చూడడానికి సహాయము చేసిన యేసయ్యకు వందనాలు చెల్లిస్తామా? 

 

ఒక గ్రామంలో ఒక పెద్ద అందమైన నేరేడు చెట్టు ఉండేది ఆ చెట్టు పక్కనే ఒక చిన్న గుడిసే ఉండేది. ఆ ఇంటి లోపల అమ్మ పనిచేస్తున్నారు. ఆ నేరేడు చెట్టు నీడలో ముగ్గురు వృద్ధులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలాసేపు మాట్లాడుకున్నారు భోజనం చేయుటకు పిలుద్దాము అని తలంచి అమ్మవారిని పిలిచారు. గ్రామమునకు ఎవరు వచ్చినా ఆమె ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటారు వారిని పరామర్శిస్తుంటారు. ఇందువల్ల కొందరు దేవదూతలు కూడా పరామర్శించ బడ్డారు అనే వాక్యం ఉంది. సరే కథ విందామా? 

 

ఆ అమ్మగారు పిలిచిన వెంటనే మేము ముగ్గురుము రాము ఎవరైనా ఒక్కరిమె వస్తాము అని అన్నారు. మొదటిగా ఉన్న వ్యక్తి పేరు ఆస్తి రెండో వ్యక్తి పేరు విజయము మూడో వ్యక్తి పేరు ఏమిటో తెలుసా ప్రేమ. ఈ ముగ్గురిలో ఎవరు మీ ఇంటికి రావాలి అని అడిగారు. ఈ మాట విన్న వెంటనే ఆ అమ్మగారు తన భర్త వద్దకు వెళ్లి అడిగేసి వస్తాను అని చెప్పి వెళ్లారు. ఆ భర్తకు చెప్పిన వెంటనే సరే ఆస్తిని పిలుద్దాం అప్పుడే మన ఇంటికి చాలా సహాయము వస్తుంది అన్నారు. లేదు మనం విజయాన్ని పిలుద్దాం అని అన్నాడు. అప్పుడు మా ఇంట్లో ఉన్న కుమారుడు లేదు మనము ప్రేమను పిలుద్దాం అప్పుడు ఆస్తులు అవకాశాలు వాటంత అవే వస్తాయి అని చెప్పేటప్పుడు ఆ అమ్మ కూడా భర్తతో కలిసి ప్రేమ మీరు రండి అని చెప్పిన వెంటనే ప్రేమ లేచి ఇంటిలోనికి అడుగుపెట్టడం ప్రారంభించింది. దాని వెనక ఆస్తి, విజయము కూడా ఇంట్లోనికి అడుగుపెట్టాయి. అమ్మకు చాలా సంతోషం అనిపించింది. ఆస్తిని , విజయాన్ని పిలిచి ఉంటే వారు మాత్రమే వచ్చి ఉంటారు కానీ మీరు ప్రేమను పిలిచారు కాబట్టి ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ విజయం ఆస్తి వస్తుంది అని చెప్పారు. 

 

హలో నా బుజ్జి పిల్లలు ప్రేమ అంటే ఏసుక్రీస్తు ప్రభువే నూతన సంవత్సర ప్రారంభంలో యేసయ్య మీ జీవితంలోనికి పిలవండి ఆయన ఈ సంవత్సరానికి సరిపడా మేలులను మీకు దయ చేస్తారు. మీరు కళ్ళు మూసుకుని యేసయ్య మీరు మాతో ఉంటే చాలు అని చెప్పండి చూద్దాం. వెరీ గుడ్ ఇలాగే రోజు ప్రార్ధన చేయాలి ఓకేనా! 

- శ్రీమతి. దేబోరా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al superbetin pashagaming jojobet jojobet giriş holiganbet instagram unban service instagram unban service