By Village Missionary Movement
Saturday, 20-Jan-2024దిన ధ్యానము(Telugu) 20.01.2024
అంశం:- దేవుని రాజ్యం
"వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును" - యెషయా 60:22
మనుషులు దైనిక సత్యాల గురించి సులువుగా అర్థం చేసుకోవాలని ఏసుక్రీస్తు ప్రభువు అనేక ఉపమానాలు చెప్పారు. ఒకసారి ఆవగింజను పరలోక రాజ్యంతో పోల్చి చెప్పారు. ఆవగింజ సకల విత్తనముల కంటే చిన్నదిగా ఉన్నప్పటికీ ఎదిగినప్పుడు అన్ని చెట్లు కంటే పెద్దగా ఎదిగి ఆకాశ పక్షులు దాని మీద నివాసం ఉండే విధముగా పెద్ద వృక్షముగా ఎదుగుతుంది అని చెప్పారు. అవును దేవుని రాజ్యము దేవుని పిల్లలు లోక దృష్టిలో ఆల్పముగా కనబడుతున్నారు అయినప్పటికీ ఎలాగూ ఈ చిన్న ఆవగింజ ఎదిగి పెద్దదై వృక్షం అవుతుందో అలాగే దేవుని రాజ్యము కూడా పెద్దదవుతుంది. అది మాత్రమే కాదు అది అనేకులకు ఆదరించే విధముగా ఉంటుంది.
ప్రియమైన వారలారా ఈ దినము మనము జీవించే లోకమును చూడండి అవినీతి, అక్రమము, భూకంపాలు, తుఫాను, రోగాలు, యుద్ధాలు అని భయంకరమైన దిశగా వెళుతూ ఉంది కానీ వీటి మధ్యలో ప్రభువు దేవుని పిల్లలైనా మనలను ఆవగింజగా పెట్టి ఆశ్చర్య రీతిగా నడిపిస్తున్నారు.
దీనిని చదువుతున్న దేవుని పిల్లలరా మనుషుల దృష్టిలో మీరు చిన్నవారిగా కనబడవచ్చు మీ పని అల్పమైనదిగా కనబడవచ్చు కానీ చూడండి రాక్షసుడైన గొలియాతును జయించుటకు దావీదును దేవుడు వాడుకున్నారు అలాగే దేవుడు మనల్ని వాడుకుంటారు. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు కాబట్టి నిరుత్సాహాన్ని విడిచిపెట్టి భయాన్ని విడిచిపెట్టి ధైర్యంతో దేవుని రాజ్యంలో పని చేద్దాం. దేవుని రాజ్యం పెద్దదై విస్తరిస్తూ ఉంది. 12 మంది శిష్యులతో ప్రారంభించబడిన పని 20 శతాబ్దాలుగా లోకము చివరి వరకు విస్తరిస్తూ ఉంది. గొప్ప రాజ్యముగా ఏర్పడింది. అవును ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనాంగం అగును అనే వాక్యం ఎంతగా నెరవేర్చబడింది. దేవుడు చేయదలచినది ఏది కూడా నిరర్థకంకానేరదు. హల్లెలూయ!
- సిస్టర్. బ్యూలా గారు
ప్రార్థన అంశం:-
తిరుచిలో కట్టబడుతున్న ఉజ్జీవపు ప్రార్థన కూడిక కట్టడ పనుల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250