Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.01.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 21-Jan-2024

దిన ధ్యానము(Telugu) 21.01.2024 (Kids Special)

 

అంశం:- పవర్ ఆఫ్ ప్రేయర్

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను" - కీర్తనలు 2:8

 

ఇంగ్లాండ్ దేశంలో అన్నయ్య చెల్లి ఇద్దరు ఆ కుటుంబంలో నివసిస్తున్నారు. అన్నయ్య హాట్సన్, చెల్లి అమల్య కంటే నాలుగు సంవత్సరాల పెద్దవాడు. హాట్సాల్ చక్కగా ప్రార్ధించి బైబిలు చదివి సండే స్కూల్ కి వెళ్తూ జీవిస్తూ ఉన్నాడు. హాట్సన్ ఎదిగి కాలేజీ చదువు పూర్తి చేసి పెద్దవాడై బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. బయట ఊరికి వెళ్లి పని చేయడం ప్రారంభించాడు. మంచి పని, మంచి జీతం, చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటూ ఉండేవి. 

 

మన చేతిలో డబ్బులు ఉంటే ఏది మనకు అవసరమో దాన్ని వెంటనే కొనేస్తాము కదా? అలానే హాట్సన్ కూడా ఒంటరిగా ఉండటం వలన తన ఇష్టానుసారముగా జీవించడం ప్రారంభించాడు. దేవున్ని వెతుకుటకు మనసు రాలేదు. కొంచెం కొంచెంగా దేవున్ని విడిచి వెళ్లిపోయాడు. ఎక్కువ జీతం అవసరం లేని చెడు అలవాట్లు, ఒంట్లో అనారోగ్యం కలిగి ఉన్నాడు. అనారోగ్యం వల్ల ఎలా ఒంటరిగా ఉండగలడు కనుక తన ఇంటికి తిరిగి వచ్చాడు. తన చెల్లితో అన్నయ్య దేవుడు ఉన్నారు అని నేను నమ్మలేకపోతున్నాను. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది బైబిల్ చదవడం మానేశాను అని చెల్లితో చెప్పాడు. దానిని విన్న అమల్యా చాలా బాధపడి ఒంటరిగా తన గదిలోనికి వెళ్లి తన అన్నయ్య కొరకు ప్రార్ధించింది. యేసయ్య మా అన్నయ్య నీ ప్రేమను రుచి చూసినట్లు చేయండి అని ప్రార్థించేది.

 

 అద్భుత రీతిగా హాట్సన్ మరలా దేవుని ప్రేమను ఎరిగాడు. ఈ ప్రేమ గల దేవుడిని అందరికీ చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. చైనా దేశంనకు మిషనరీగా బయలుదేరి వెళ్లాడు. ఈయన ద్వారా చైనా దేశంలో అనేకులు దేవుని తెలుసుకోవడానికి పరలోకానికి వారసులుగా అవ్వడానికి కారకుడు అయ్యాడు. 

 

 ఏంటి పిల్లలు హాట్సన్ అన్నయ్య కొరకు అమల్యా అక్క ప్రార్ధించినట్లు మీరు కూడా మీ స్నేహితుల కొరకు మీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల కొరకు మీరు ప్రార్థించినప్పుడు యేసయ్య ఖచ్చితంగా మీ ప్రార్థన విని జవాబు ఇస్తారు. ఇప్పుడే ప్రార్ధించడం ప్రారంభిస్తారా? రెడీయేనా ? 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet