Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.02.2024
Share:

By Village Missionary Movement

Thursday, 08-Feb-2024

దిన ధ్యానము(Telugu) 08.02.2024

 

అంశం:- అనేక విధములైన విత్తనాలు

 

"మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును" - గలతియులకు 6:7

 

ఒక మనుష్యుడు యొక్క తలంపు ఎలా ఉంటుందో అలానే వారు ప్రవర్తిస్తారు అని బైబిల్ చెప్తుంది. అనగా ఒక మనిషి ఒక హృదయ ఆలోచనలు వారి యొక్క కార్యాలను వ్యక్తపరుస్తాయి. ఒక మనిషి యొక్క కార్యాలే వాడు విత్తె విత్తనాలు. మనుష్యుడు విత్తే అనేక విధములైన విత్తనముల గురించి అందువల్ల వారు పొందుకుంటున్న ఫలితాన్ని గురించి బైబిల్ ఏమి చెబుతుందో ఈ దినము ధ్యానిద్దాం. 

 

శరీరానుసారముగా విత్తే విత్తనము:-

ఇది తమ యొక్క మనసు, శరీరము కోరుకుంటున్న కార్యాలనే ఆశించి ఈ విత్తనాలను విత్తుతున్నారు. దీనిని విత్తే వారు దేవుడు ఆశించని శరీరానుసారమైన కార్యాలనే చేస్తారు. ఇలాంటి మనుషులు అన్యాయంగా విత్తుట వలన దుఃఖాన్ని, శాపాన్ని ఫలితంగా పొందుకుంటారు (సామెతలు 22: 8). వీరి యొక్క ముగింపు నిత్య నాశనము అనే పంటగా ఉంటుంది. 

 

ఆత్మానుసారముగా విత్తే విత్తనము:-

క్రీస్తును నమ్మిన వారు ఈ విత్తనములు విత్తుతారు. వారు ఆత్మ చేత నడిపించబడతారు. వారి యొక్క కార్యాలు వారి యొక్క ఫలాన్ని వ్యక్తపరుస్తాయి. వీరు తమ ఆత్మీయ జీవితానికి ఇతరుల యొక్క ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైన విత్తనాలను విత్తుతూ ఉంటారు. ఇలాంటి నీతి గల విత్తనాలు విత్తే వారు నిత్యజీవము అనే ఫలితాన్ని పొందుకొనుటకు మార్గాన్ని సరాళం చేస్తున్నారు. 

 

మేలు కలిగించే విత్తనాలు:-

సువార్తికులు, విశ్వాసలు విత్తే సువార్త విత్తనాలు. బైబిల్ వాక్యములను ఇది చెప్తుంది. ఇలాంటి విత్తనములు ఆత్మల పంటను ఇస్తున్నాయి (మొదటి కొరింది 9:11). 

 

ధర్మ సహాయమైన విత్తనాలు:-

రెండవ కొరింది 1: 6-12 లోకగల వాక్యాలు దీనిలో గల పరిశుద్ధులు ఆదరించుటకు ఇవ్వబడుతున్న సహాయము. పేదవారికి ఇవ్వబడుతున్నటువంటి ధన సహాయము గురించి చెప్పబడుతుంది. ఇలా కొద్దిగా విత్తె వారు కొంచెం మేలులను ఫలితంగా పొందుకుంటారు. విస్తారంగా విత్తే వారు విస్తారమైన మేలులను పంటగా కోస్తారు. బీదలకు ఇచ్చేవాడు అనే నీతి ఎన్నడు ఆగిపోకుండా వారి యొక్క క్రియలు విస్తరించబడి జీవించబడుతుంది. 

 

ప్రియమైన వారలారా! మనం ఎలాంటి విత్తనములు విత్తుతూ ఉన్నాం. ఏదైనా సాకులు చెబుతూ మంచి విత్తనాలు విత్తకుండా ఉండిపోకూడదు. ఎందుకంటే గాలిని చూచేవాడు విత్తడు, మేఘాలు కనిపెట్టేవాడు కోయడు (ప్రసంగి 11:4). ఉదయమున విత్తనం విత్తుము సాయంకాలమున నీవు పంట కొరకు వేచి ఉండము అని బైబిల్ చెబుతూ ఉంది. ఉదయము అన్నది ఉత్సాహవంతముగా మనం ఉంటున్న సమయం. సాయంకాలం అన్నది అలసట వలన నిరుత్సాహముతో ఉంటున్న సమయం. మన శరీరము మనసు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు కోరుకుంటున్న మంచి విత్తనాలు విత్తాలి అన్నదే పైన చెప్పబడిన వాక్యం యొక్క అర్థము. మన క్రియలు అనే విత్తనాలను నిరుత్సాహ పడిపోకుండా విత్తిన యెడల తగిన కాలమందు ఆ పంటను కోస్తాం. దేవుడు మీకు సహాయం చేస్తారు. 

- శ్రీమతి. గీతా రిచర్డ్ గారు 

 

ప్రార్థన అంశం:-

ప్రతి రాష్ట్రంలో 300 మంది గిద్యోనులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet