Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.02.2024
Share:

By Village Missionary Movement

Friday, 09-Feb-2024

దిన ధ్యానము(Telugu) 09.02.2024

 

అంశం:- ఫలభరితమైన విత్తనాలు

 

"ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు" - యెషయా 26:3

 

నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు మా వీధిలో జరుగుతున్న సండే స్కూల్ ద్వారా దేవుని ప్రేమను తెలుసుకున్నాను. అక్కడ నేర్పించిన దేవుని యొక్క వాక్యము నా హృదయములో చెట్టుకు కట్టబడిన మేక వలె నా హృదయంలో ఉండిపోయింది. ఆ విత్తనం నా హృదయంలో నుండి పనిచేయడం ప్రారంభించింది. తరచు నేను నా పక్కన జరుగుతున్న గృహ కూడికలకు యవనస్తుల ప్రార్థనా కూడికలో కలుసుకోవడం ప్రారంభించాను. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నా జీవితంలో ఒక యవ్వనస్తుల ప్రార్థనలో తూర్పు భారతదేశంలో పరిపూర్ణ మిషనరీలుగా పని చేయుటకు నన్ను నేను సమర్పించుకున్నాను. సంవత్సరాల గడుస్తుండగా అన్నింటిలో నేను దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా స్కూల్, కాలేజ్ అన్నింటిలో దేవుడు నాకు మంచి మార్కులు దయచేశారు. చదువు పూర్తి అయిన తర్వాత ఒక పెద్ద కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం వచ్చింది మంచి జీవితం. రోజులు గడిచాయి నన్ను నేను దేవునికి సమర్పించుకున్న సంగతి మర్చిపోలేదు. నా జీవితము గొప్ప మలుపు ద్వారా దేవుడు తన సన్నిధిలో మళ్ళీ తిరిగి రావడానికి సమయం దయచేశారు. తూర్పు భారతదేశంలో నీ సేవ చేయాలి అని నాకు ఉంది కాబట్టి మీరు తూర్పు భారతదేశంలో పనిచేసిన ఒక మంచి భర్తను నాకు ఇవ్వమని ప్రార్థించాను. రెండు సంవత్సరాలు నా జీవితంలో కన్నీళ్లు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినను నేను దేవున్ని గట్టిగా పట్టుకుని ఉన్నాను. రెండు సంవత్సరాల తర్వాత నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చారు. చత్తీస్గడ్ ప్రాంతంలో పరిచర్యలో పనిచేసిన వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. నేను అక్కడికి వెళ్లి హిందీ కూడా నేర్చుకున్నాను. చత్తీస్గడ్, మహారాష్ట్ర ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు కుటుంబంతో దేవుని సేవను చేశాము. ఇప్పుడు మూడు సంవత్సరాలకు పైగా గ్రామ మిషనరీ కుటుంబములో దేవుని సేవను చేస్తూన్నాము. 

 

పరిశుద్ధ గ్రంథంలో రూతు అనే ఒక స్త్రీ గురించి మన చదువుతున్నాం. దేవున్ని విడిచి పెట్టకుండా గట్టిగా పట్టుకుంది రూతులో ఉన్న ఫలభరితమైన విత్తనాలు ద్వారా ఒక గొప్ప సంతతి రావడానికి కారణమైంది. నేను చిన్నప్పుడు నా హృదయంలో విత్తబడిన విత్తనాలు ద్వారా దేవుని కొరకు ఏదైనా చేయాలి అని ఆశ పుట్టించింది. విత్తనాలు నాలో ఉన్న విశ్వాసాన్ని ఈరోజు పరిపూర్ణ మిషనరీగా ఫలాలు ఇస్తుంది. దీని చదువుతున్న మీరును మీ ప్రాంతంలో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యాన్ని విత్తవచ్చు కదా! ప్రారంభ దినాలలో మన కళ్ళల్లో ఫలాలు కనిపించకుండా ఉండవచ్చు కానీ ఒకరోజు కచ్చితంగా మన విత్తిన విత్తనాల యొక్క ఫలం మనకు కనబడుతుంది. విత్తనములు ఈరోజు విత్తుదాం పరలోకంలో ఫలాలను చూద్దాం. విత్తడానికి రండి! 

- బ్రదర్. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న 24 గంటల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఒక్కొక్కరిని ప్రార్థన ఆత్మతో నింపేలా ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet cashwin grandpashabet radissonbet palacebet amgbahis cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet