Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.02.2024
Share:

By Village Missionary Movement

Monday, 19-Feb-2024

దిన ధ్యానము(Telugu) 19.02.2024

 

అంశం:- చేర్చుకునే తండ్రి

 

"ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని" - ద్వితియోపదేశకాండము 1:31

 

ఒక గ్రామంలో రేఖ మరియు వాళ్ళ అమ్మ జీవిస్తూ ఉన్నారు. అక్కడ ఆరో తరగతికి పైగా చదువుటకు అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయికి హాస్టల్ లో చేర్పించి చదివించారు. ఆమె అక్కడికి వెళ్లి చదవడం ప్రారంభించింది. అక్కడున్న స్నేహితులతో కలిసిపోయింది, రేఖ యొక్క జీవితం మారిపోయింది. చాలా పేదరికంలో ఉన్న తన తల్లిని ద్వేషించింది. నెల నెల నన్ను హాస్టళ్లకు వచ్చి చూడడానికి రావద్దు అని చెప్పి ఎవరికైనా డబ్బులు ఇచ్చి పంపించమని చెప్పేది. సెలవు రోజు కూడా తన స్నేహితులతో పాటు కలిసి వాళ్ళింటికి వెళ్ళేది లేకపోతే హాస్టల్లోనే ఉండిపోయేది. 

 

ఇలాగ సంవత్సరాలు గడిచిపోయాయి. పదవ తరగతి పరీక్షలు వచ్చాయి. రేఖ యొక్క చర్మంలో అలర్జీ వలె వచ్చింది. అది చాలా పెద్దదిగా మారిపోయింది. అందువలన తన స్నేహితులు తనతో పాటు కలవకుండా తన ద్వేషించేవారు. ఆమెను హాస్టల్ నుండి వెళ్ళిపోమని చెప్పారు. అప్పుడు ఆమె అనుకుంది నేను ఏడవ తరగతి నుండి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఆమె నన్ను చూడదు అని అనుకున్నది. అలానే వ్యాధితో ఉన్నప్పుడు తనను ఎవరు పట్టించుకోరు అని అనుకున్నది. కానీ అమ్మ చాలా ప్రేమతో వచ్చి రేఖను హస్పటల్ తీసుకుని వెళ్లి అక్కడ డాక్టర్లకు చూపించి చాలా ప్రేమతో చూసుకుంది. ఇలానే బైబిల్ గ్రంధంలో కూడా చిన్న కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి తన వద్ద ఉన్న ధనమంతటిని ఖర్చుపెట్టి పందులను మేపుటకు పనిలో చేరి పందులు తినే పొట్టు కూడా తనకు తినుటకు దొరకలేదు అని సరైన బట్టలు లేవు ఆకలికి అలమటిస్తున్న వేళలో తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. తండ్రి తనను చాలా దూరం నుండి చూసి పరిగెత్తుకుని వెళ్లి మెడ పైన ముద్దు పెట్టుకుని కొడుకుగా తనను అంగీకరించారు. అలానే విందును ఏర్పాటు చేశారు. 

 

అదేవిధంగా దేవుడు కూడా క్షమాపణ అడిగితే ఆయన మనల్ని క్షమించి మరల మరల ఆయన అంగీకరించుటకు చాలా ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. దేవుని వద్దకు వస్తున్న ఎవరిని ఆయన త్రోసివేయుడు. అందరినీ ఆయన ప్రేమతో చేర్చుకుంటారు. కాబట్టి ఈ రోజే మీరు రండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నాను మిమ్మల్ని చేర్చుకొనుటకు దేవుడు చాలా ఆసక్తితో ఉన్నారు. మీరు ఎలా ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితితో దేవుని వద్దకు రండి. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా నేను ఎక్కడికి వెళ్లాలి? నన్ను చేర్చుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ చూసినా నాకు కష్టాలే ఇబ్బందులే ఏమి చేయాలో నాకు తెలియడం లేదు అని అనుకుంటున్నారా? యేసయ్య వద్దకు రండి అతను మిమ్మల్ని తన బిడ్డలగా చేర్చుకొనుటకు ఆయన చాలా ఆశతో ఉన్నారు. యేసుప్రభు వద్దకు రండి ఆయన దీవెనలు పొందుకొనండి. 

- బ్రదర్. మురళి గిద్యోను గారు 

 

ప్రార్థన అంశం:-

లే మిషనరీల కొరకు, మిషనరీల కొరకు సంఘాలు కట్టబడే లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet cashwin grandpashabet radissonbet palacebet amgbahis cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet