Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.02.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 27-Feb-2024

దిన ధ్యానము(Telugu) 27.02.2024

 

అంశం:- ఉపవాసం

 

"ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి" - యోవేలు 1:14

 

పరిశుద్ధ ఉపవాస దినమును ఏర్పరచుడి. ఉపవాసము క్రైస్తవుల జీవితములో ప్రాముఖ్యమైన కార్యము. ఉపవాసము పెద్ద దేవుడ్ని కదిలించడానికి అవసరమైన ఒక కార్యము. కానీ ఈరోజు అందరూ నుండి మర్చిపోయిన విధముగా ఉంది. కారణం దాని యొక్క విలువను తెలియకుండా ఉండడమే దీనికి గల కారణము. మరి ఈరోజు దాని యొక్క విలువను చూద్దామా? 

 

1. దేవుని దగ్గర కనికరము పొందవచ్చు:-

నినీవే ప్రజలు పాపములో ఉన్నప్పుడు దేవుడు నినీవే ప్రజలను నాశనము చేస్తాను అని యోనా ద్వారా హెచ్చరిక పంపించారు. అప్పుడు దానిని విన్న ప్రజలు చంటి పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరను ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు(యోనా3:5-8). దేవుడు దాన్ని చూసి మారుమనసు పొంది నినీవే పట్టణమును నాశనం చేయకుండా కనికరించెను. 

 

2. శత్రువుల ముందు విజయం దోరుకుతుంది:-

హమాను తనను పూజించలేదనే కారణంగానే మొర్దెకైను అతని యొక్క యూదులందరినీ నాశనం చేయుటకు ప్రణాళికను వేశాడు కానీ వారు ఉపవాసముండి మూడు రోజులు ప్రార్ధించిన తర్వాత మొర్దెకై ఎప్పుడో చేసిన మేలు రాజుకు తెలియపరచబడింది. అందుకు రాజు మొర్దెకైకు ఘనత ఇవ్వాలని హమానుకు రాజు ఆజ్ఞాపించాడు. అది మాత్రమే గాక హామాను యొక్క ప్రణాళిక వేరే విధముగా మారి యూదులందరూ కాపాడబడ్డారు. 

 

3. సాతానును జయించవచ్చు:-

యేసుప్రభు ఈ భూమ్మీద ఉన్న రోజులలో మొట్టమొదటిగా సేవను ప్రారంభించడానికి మునుపు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. అప్పుడు అతనిని శోధించుటకు సాతాను వచ్చాడు. దేవుడు సాతాను పైన జయము పొందారు. శిష్యులు వద్ద స్వస్థత పొందికొనుటకు ఒకరు వచ్చారు। శిష్యుల ద్వారా ఆ కార్యము జరగలేదు. అప్పుడు యేసుప్రభు ఈ సాతాను ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా మాత్రమే వెళ్తుంది మిగతా కార్యాల వల్ల అది జరగదు అని చెప్పారు (మత్తయి 17: 21).

 

4. క్షేమము దొరుకుతుంది:-

నెబుకద్నేజరు యెరుషలేము దేవాలయం నుండి తీసుకొని వచ్చిన చాలా వస్తువులైన వెండి, బంగారమును వస్తువులు అన్నింటిని మరల తిరిగి యెరుషలేము దేవాలయమునకు తీసుకొని వచ్చినప్పుడు దుష్టుల చేతిలో నుండి దాన్ని కాపాడుడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన క్షేమముగా ఆ వస్తువులను యెరుషలేము దేవాలయమునకు చేర్చబడ్డాయి. వారు చేసిన పనిలో సంపూర్ణమైన విజయాన్ని పొందుకున్నారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీరు దేవుని యొద్ద నుండి కనికరాన్ని పొందుకోవాలా? మీరు ఎక్కడ త్రునికరించబడ్డారో ఆ స్థలంలో మీకు జయమును ఘనతను దేవుడు ఇవ్వాలా? అయితే ఉపవాసం ఉండి దేవుని యొక్క పాదముల వద్ద వేచి ఉండండి అతను మనకు ఫలమును ఇచ్చి మనతో ఉండి నడిపిస్తారు. ఉపవాసం యొక్క ఫలమును మీరు రుచి చూస్తే మీరు ఉపవాసం చేయకుండా ఉండలేరు. ఈ సంవత్సరం మీరు ఈ విధముగా ప్రయత్నం చేసి చూడండి దేవుని దగ్గర దీవెనలను, సంతోషమును, నెమ్మదిని మీరు పొందుకుంటారు. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:-

మిగతా రాష్ట్రాల మిషనరీల యొక్క కుటుంబాలు దేవుడు దీవించాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet