By Village Missionary Movement
Tuesday, 05-Mar-2024దిన ధ్యానము(Telugu) 05.03.2024
అంశం: నాకు శక్తి ఉన్నది
"నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను" - ఫిలిప్పీయులకు 4:13
వెల్మా రోడాల్ఫ్ అనే స్త్రీ పక్షవాతం చేత బాధపడుతూ ఉంది కానీ ఎలాగైనా విజయవంతమైన స్త్రీగా జీవించాలి అని నిర్ణయించుకొని కఠినముతో ప్రయాసపడింది. బలహీనమైన తన నరాలు బలపడేటట్లు మంచిగా ఆహారం భుజించి కఠినమైన వ్యాయామం చేసి పరిగెడుతూ పరుగుపందంలో 1960వ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్ ఆటలో మూడు గోల్డ్ మెడలను గెలుచుకొని ప్రపంచంలోనే వేగవంతమైన స్త్రీ అని పేరు పొందుకున్నది.
సెలీమా అనే స్త్రీ ఐదు సంవత్సరాలు ఉండినప్పుడే పక్షవాతము చేత బాధపడింది. అయినప్పటికీ ఆమెలో కనబడిన ఎనలేని విజయం సాధించాలి అనే తలంపు ఈ రోగాన్ని అణిచివేసింది. ఈమె 1956 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్ క్రీడలో మూడు మెడల్స్ ను సంపాదించుకుంది.
20 సంవత్సరాలకు మునుపు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో సైమన్ డోనఫ్ ఆడేవాడు. ఈయన యవ్వనస్తుగా ఉండేటప్పుడే క్యాన్సర్ చేత బాధింపబడ్డాడు. అయినను వైద్యులు చేత చికిత్స ప్రయాసపడి నేషనల్ క్రికెట్ జట్టులో వేగవంతమైన బౌలర్గా మారగలిగాడు.
పైన చెప్పబడిన ముగ్గురు వ్యక్తులు కూడా జీవితంలో చాలా హీనమైన పరిస్థితిలో త్రోసి వేయబడిన వారు. అయినప్పటికీ వీరు తమ బలహీనతల గురించి ఆలోచించకుండా జీవితములో సాధించుట ఎలా అనే ఆలోచనతో ముందుకు వెళ్లారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు ఇలా చెబుతూ ఉన్నాడు నా బలహీనత యందు నేను సంతోషించుచున్నాను ఎందుకంటే క్రీస్తు శక్తి నాలో ఉండినందున బలహీనత యందు నేను బలవంతుడిగా ఉంటున్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. 2 కొరింథీ 12: 9 మరియు ఫిలిప్పీలు రాసిన పత్రికలో నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు. ఈ సందేశాన్ని చదువుతున్న మీరు ఎందులో అయినా బలహీనులుగా ఉన్నప్పుడు నిరుత్సాహ పడిపోకుడి. మీ బలహీనమైన కార్యాలు బలముగా మారుటకు ప్రార్థించుడి ప్రయాసపడుడి. ప్రభువు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరుచును గాక! (2తిమోతి 4: 17).
- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు
ప్రార్థన అంశం:-
7000 మంది మిషనరీలు, లక్ష గ్రామాలు అనే గురిని మనము చేరుకునేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250