Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.03.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 13-Mar-2024

దిన ధ్యానము(Telugu) 13.03.2024

 

దిన ధ్యానము

 

అంశం: దేవుని కృప

 

"అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను" - ఆదికాండము 6:8

 

ఒక నేల బొగ్గు తవ్వుతున్న గనిలో పనిచేస్తున్నారు జేమ్స్. ఎలాగైనా అక్కడ ఉన్న అందరికీ యేసు గురించి చెప్పాలి అని ఒక భారం కలిగి ఆయన ప్రయాస పడుతూ ఉన్నాడు. అందువలన తనతో ఉన్న వారందరికీ సువార్త ప్రకటించాడు. ఇందువలన వీడికి పిచ్చి పట్టింది అని అందరూ హేళన చేశారు. ఒక దినము అందరూ మధ్యాహ్నం ఆహారం తినడానికి కూర్చుని ఉండినప్పుడు జేమ్స్ భోజనాన్ని ఒక కుక్క ఎత్తుకొని వెళ్ళిపోయింది. జేమ్స్ ఆ కుక్కను తరుముకుంటూ ఆ బొగ్గు గని బయటకు వెళ్లిపోయాడు. దానిని చూచిన అందరూ హేళన చేశారు వీడు భోజనాన్ని యేసయ్య కాపాడలేకపోయాడు ఈయనను ఎలా కాపాడుతారు అని హేళన చేశారు. కొంత సమయం తర్వాత ఆ బొగ్గు గనిలో ఒక పేలుడు సంభవించి దానిలో ఒక భాగము కూలిపోయింది. దానిలో గల అందరూ కూడా గాయపడ్డారు కొందరు మరణించారు కూడా. కానీ బయటికి వెళ్లిన జేమ్స్ మాత్రం దేవుని కృప చేత సమరక్షించబడ్డారు. 

 

ప్రియమైన వారలారా! బైబిల్లో కూడా నోవాహు తన కాలంలో జీవించిన ప్రజలందరికీ ఆయన నీతిమంతుడిగాను, యదార్ధ వంతుడి గాను ఉన్నాడు. నోవాహు జీవించిన కాలంలో మనిషి యొక్క అక్రమాలు భూమిపైన విస్తరించాయి అని దేవుడు చూశారు. మనుషుల్ని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాప పడ్డారు. దేవుడు నోవాహును చూసి ఆ నోవాహు ద్వారా ఆ ప్రజలను హెచ్చరించినప్పటికీ వారు దేవుని మాటను వినలేదు పైగా నోవాహు మాటలు హేళన చేశారు. దేవుని కోపోగ్రతకు గురి అయ్యారు. అందువలన దేవుడు జల ప్రళయం చేత భూమిని నాశనం చేశారు. నోవాహు కుటుంబంలో గల ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడ్డారు మిగిలిన వారందరూ కూడా మరణించారు. కానీ నోవాను, నోవాహు కుటుంబమునకు దేవుని దృష్టిలో కృప దొరికింది. అందరూ సంరక్షించబడ్డారు. 

 

ప్రియమైన వారలారా! ఆ బొగ్గు గనిలో పనిచేసిన జేమ్స్ ని అనేకులు హేళన చేసినప్పటికీ దేవుని పైన గల ప్రేమ చేత ఆయన పట్టుదలతో ఉన్నారు. అందువలన ఆయన ప్రాణము నాశనము కాకుండా తప్పించబడింది. నోవాహు దేవునికి లోబడినందున ఆయనతోపాటు ఆయన కుటుంబం కూడా జలప్రలయము నుండి తప్పించబడింది. ఇలాగే మీరు కూడా కాలేజీలో చదువుతూ ఉన్న, పని చేస్తున్న స్థలంలో మీరు దేవుని కొరకు జీవించి ఉంటే లోకము మీతో కలిసి లేనందున లేక మీతో పాటు ఉన్న వారు హేళన చేయవచ్చు, మిమ్మల్ని తిరస్కరించవచ్చు. మీరు కలత చెందకుండా ధైర్యముతో ముందుకు వెళ్లి దేవుని మాటకు లోబడి మీరు నడుచుకున్నప్పుడు దేవుని దృష్టి మీ మీద ఉంటుంది. అందువల్ల ఆయన కృపను మీరు పొందుకుంటారు. అన్ని విధములైన ప్రమాదంలో నుండి మిమ్మల్ని తప్పిస్తారు. దేవుడు మీతో ఉన్నారు అనేదాన్ని ప్రజలు గుర్తిస్తారు. దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక! 

- బ్రదర్. క్రిస్టోఫర్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో కట్టబడుతున్న మిషనరీ గదులు కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort